
| Movie Name | & English |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label | ? SAV Music Telugu |
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నేనిన్ను చూడ
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నేనిన్ను చూడ
అల్ఫయు నీవే… ఓమేగయు నీవే
ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసూ నీ స్వరూపము
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభువ నిను జూడనిమ్ము
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేని వాడ నే నైతిని
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిను జూడనిమ్ము
ఎరిగి ఎరిగి నే చెడిపోతిని
యేసూ నీ గాయము రేపితిని
మోసపోతి నేను దృష్టిదొలగితి
దాసుడ నిను జూడనిమ్ము
ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెలుగు ముఖమున
సందియంబు లేక సంతోషించుచు
ముందకు పరుగెత్తెదరు
విశ్వాసకర్తా ఓ యేసుప్రభూ
కొనసాగించువాడ యేసుప్రభూ
వినయముతో నేను నీవైపు చూచుచు
విసుగక పరుగెత్త నేర్పు
కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో
హృదయ గోచరము కానివెన్నియో
సిద్ధపరచితివా నాకై
లోకభోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృపజూపుము
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము
Prabhu Yesu Na Rakshaka song is from the & English movie.