
| Movie Name | & English |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | The Fantasia Men |
| Singer(s) | Karthik |
| Lyricist | Madhusudhan Andukuri |
| Music Label | Sony Music South |
వేవేల రంగుల్లోన మెరిసావమ్మా
నీ నీలి కన్నుల్లోన కరిగానమ్మా
వినిపించే ఏ మాటైనా నీదేనమ్మా
కనిపించే కలలో కూడా నువ్వేనమ్మా
ఆ దివిలో నువ్వెగిరే ఈ క్షణమే
నా భువిలో కల్లోలం మిగిలిందే
నిను కోరే నన్నే వదిలి వెళ్ళిపోవద్దే
తీరాన్నే తాకి ఒంటరి అలలా మిగిలావే
నువ్వమ్మా… నువ్వెక్కడ ఉన్నా
పక్కనే ఉండే కలనే కంటూ
నీకోసం చూస్తూ ఉన్నా
నువ్వమ్మా… ఏ తీరం దూరం
చెరపవి కధవమ్మా కన్నమ్మా
సంద్రాలే దాటి చిరుగాలై వస్తా
నిను తాకే స్పర్శే పరవశమై
ప్రతి అణువూ నేనై నీకోసం చూస్తా
నిను తలచే నడిచాలే
మన దూరం చెరిపే ప్రతి మలుపు
ఈ ప్రేమ లోకంలో నిను చేరే పయనంలో
ఏమవుతుందో ఎటుపోతుందో ఏమో
నడిచే నిజమై నువ్వే ఎదురై వస్తే
కడదాకా నీతోనే అంటున్నా
నువ్వమ్మా… నువ్వెక్కడ ఉన్నా
పక్కనే ఉండే కలనే కంటూ
నీకోసం చూస్తూ ఉన్నా
నువ్వమ్మా… ఏ తీరం దూరం
చెరపవి కధవమ్మా కన్నమ్మా
ఈ నిమిషం కోసమే వెచిందే నా హృదయం
ఎదురయ్యే ఆనందం నువ్వేనమ్మా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా ప్రేమా…
Nuvvamma song is from the & English movie.
Nuvvamma song was sung by Karthik.
Nuvvamma song lyrics were written by Madhusudhan Andukuri.
Nuvvamma song music was composed by The Fantasia Men.