
| Movie Name | & English |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | ?????? ???? |
| Singer(s) | ?????? ??????? |
| Lyricist | |
| Music Label |
లేబుల్: E96TV Channel
పాట సేకరణ: లచ్చవ్వ
బాణాపురం గట్లనడుమ దేవా… బాయిలు శాలా కొట్టినానే ఓ బావ..
బాయిలు శాలా కొట్టినానే ఓ బావ.. బాయిలు కొట్టీ బాయిలు కొట్టి దేవా
బాకులు శాలా తెంపినానే ఓ బావ.. బాకులు శాలా తెంపినానే ఓ బావ…
గవ్వాలాది గడ్డపార బావ.. గజ్జాలాది సెలక పారా ఓ బావ..
గజ్జాలాది సెలక పారా ఓ బావ..
తొక్కీ తొక్కీ తట్టా నింపితే దేవా.. తల్లాడించి మోసినానో ఓ బావ..
తల్లాడించి మోసినానో ఓ బావ…
కోపులు కొట్టీ.. కోపులు కొట్టీ దేవా.. కొంతరకం తెంపినానే ఓ బావ..
కొంతరకం తెంపినానే ఓ బావ…
పారా నేను తెచ్చినాను దేవా. వంగి తట్టా నింపినాను ఓ బావ..
తట్టా నింపి లేపినాను ఓ బావ..
తట్టా లేపి గట్టుమీద దేవా పెట్టబోతే గడ్డి తట్టినాది బావ..
గడ్డి తట్టి నడుము పట్టినాది బావ..
సుట్టూ ముట్టూ సెను కావాలోళ్లు దేవా..
నన్నూ సూడ వచ్చినారే… ఓ బావ దోసిట్ల నీళ్లిచ్చినారే బావ..
కాపోల్ల వీధుళ్ల కుందెన ఓ దేవా.. ఒడ్లు దంచబోయినాను..
ఒడ్లు దంచి పైకము తెచ్చినాను బావ..
పైకము తెచ్చి పైకము తెచ్చి.. పైస పైస కూడబెట్టినాను బావ..
కూడబెట్టి బాకీలు కట్టినాను బావ…
కన్నాపురం గుట్టమీద దేవా.. కట్టేలేరబోయినాను ఓ బావ..
కట్టెలేరి మోపు కట్టినాను బావ..
మోపులు కట్టీ.. మోపులు కట్టీ.. మరిసిపోతీ వచ్చే తోవ ఓ బావ..
వచ్చేదెట్టా మోపు ఎత్తుకొని బావ…
మంచి నీళ్ళ బాయీ కాడా దేవా.. నీళ్ళు తొడ నేనుఓతే ఓ దేవా..
చేతులు కంది పోయినాయి ఓ బావ..
చేతులు మండి చేతులు మండి బావ..
చెప్పరాని దుఃఖమొచ్చే ఓ బావ.. చెప్పరాని దుఃఖమొచ్చే ఓ బావ…
బాణాపురం గట్లనడుమ దేవా… బాయిలు శాలా కొట్టినానే ఓ బావ..
బాయిలు శాలా కొట్టినానే ఓ బావ.. బాయిలు కొట్టీ బాయిలు కొట్టి దేవా
బాకీలు శాలా తీర్చినానే ఓ బావ.. బాకీలు శాలా తీర్చినానే ఓ బావ…
Baanapuram Gatlanaduma Deva song is from the & English movie.
Baanapuram Gatlanaduma Deva song was sung by ?????? ???????.
Baanapuram Gatlanaduma Deva song music was composed by ?????? ????.