
| Movie Name | & English |
|---|---|
| Director | Pawan Kalyan |
| Star Cast | Pawan Kalyan, Renu Desai |
| Music | Ramana Gogula |
| Singer(s) | Rajesh & Nanditha |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా
మనసు నిలవనంటే… ఎలా ఆపను?
ఏ గాలి వీస్తున్నా… నీ ఊసే వింటున్నా
ఈ వింత భావం… ఎలా చెప్పను?
ఇన్నాళ్ళు పక్కన లేవు కదా
అనే మాట గుర్తుకురాదు కదా
ఇన్నాళ్ళ ఒంటరితనమంతా
నిన్ను చూసి తప్పుకుపోయిందా
పెదవులకెన్నడూ తెలియని నవ్వులు
పరిచయమైనవి నీ వలన
ఇదివరకెన్నడూ కలగని ఆశలు
మొదలవుతున్నవి నీ వలనా
ఏమైందో ఏమో నిజంగా
లోకం మారిందో ఏమో కొత్తగా
ఏ చోట నువ్వున్నా… నీ వెంట వస్తున్నా
మనసు నిలవనంటే… ఎలా ఆపను?
ఏ గాలి వీస్తున్నా… నీ ఊసే వింటున్నా
ఈ వింత భావం… ఎలా చెప్పను
గీత..!!
ఏ నడిరాతిరి… నా దరి చేరక
కావలి ఉందిగ… నీ మమతా
నా ప్రతి ఊపిరి… ఆయువు పోయగ
వాడదుగా మన ప్రేమలతా
నూరేళ్ళు నీతో సాగనీ
వెతికే ఆ స్వర్గం… మనతో చేరని
ఏ గాలి వీస్తున్నా… నీ ఊసే వింటున్నా
ఈ వింత భావం… ఎలా చెప్పనూ
ఏ చోట నువ్వున్నా… నీ వెంట వస్తున్నా
మనసు నిలవనంటే… ఎలా ఆపనూ
Johnny Ee Chota song is from the & English movie.
Johnny Ee Chota song was sung by Rajesh & Nanditha.
Johnny Ee Chota song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Johnny Ee Chota song music was composed by Ramana Gogula.