
| Movie Name | & English |
|---|---|
| Director | Sriram Adittya |
| Star Cast | Akkineni Nagarjuna, Nani, Rashmika, Aakanksha Singh |
| Music | Mani Sharma |
| Singer(s) | Karthik & Ramya Behra |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
అయ్యయ్యో ప్రేమారా
అనుకోనే లేదురా
అమాంతం దుంకేరా
అహ హా అనిపించెరా
ఆ రోమియో
నా గుండెలో… వేశాడులే పీఠం
ప్రేమించటం
ఎల్లాగని నేర్పాడులే పాఠం
నా నయనం… చెలి నయనం
మాటాడే ప్రేమ కాలం
నాలోన జరిగిందే
మంత్రాల మాయాజాలం
హే బాబు… తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన… నీ మాటే వినదంటే
హే బాగా పడదోసే ప్రేమింతే
ఆ వల్లోనా పడిపోతే గల్లంతే
ఆకాశం కూలినా
అరెరే నాకేం తెలియదే
అణ్వస్త్రం పేలినా
ఏ శబ్దం వినిపించదే
అయస్కాంత క్షేత్రంలా ఏదో లాగిందే
మరయంత్రమై ప్రాణం తనతో సాగుతోందే
ఏంటో తనివి తీరదే
ఎంతైనా మరి చాలదే
ఇంకా ఇంకా కోరుకుంది
మనసే ఈ హాయే
విన్నా అనుకున్నా… ఏదైనా నీ పేరేనా
నిన్నా అటుమొన్న… నేనెల్లా లేనంటున్నా
హే బాబు… తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన… నీ మాటే వినదంటే
హే బాగా పడదోసే ప్రేమింతే
ఆ వల్లోనా పడిపోతే గల్లంతే
ఏ రోజు నీ కలే… నిదరోని కన్నంచున
రోజలే పూచెనే… చల్లారని గన్నంచున
పగలైనా రేయైనా… నీ ఆలోచనే
నీ ఊహ లేకుండా… నన్ను ఊహించలేనే
అద్దం జతగా దువ్వినా
ఆహా అంటూ మెచ్చినా
నన్నే కాదని చూపు తిప్పుకున్నా నీ పైన
అవునా నువ్వేనా… ఈ మార్పు నీలోనేనా
దేవి పూజలలో తేలాల్లే దేవాంతకుడైనా
హే బాబు… తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన… నీ మాటే వినదంటే
హే బాగా పడదోసే ప్రేమింతే
ఆ వల్లోనా పడిపోతే గల్లంతే
Hey Babu Devadas song is from the & English movie.
Hey Babu Devadas song was sung by Karthik & Ramya Behra.
Hey Babu Devadas song lyrics were written by Ramajogayya Sastry.
Hey Babu Devadas song music was composed by Mani Sharma.