
| Movie Name | & English |
|---|---|
| Director | Sriram Aditya |
| Star Cast | Sharwanand, Krithi Shetty |
| Music | Hesham Abdul Wahab |
| Singer(s) | Geetha Madhuri & Sri Krishna |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Sony Music South |
ఓ మనమే…
ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ రోజూ పేచీ పడ్డా మనమే
హే, మనమే, మనమే
కలిశాం మనమే
కొంచెం కొంచెం రాజీ పడ్డ వైనమే
పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే… నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పూటలా…
ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ
చరణం-1
కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన
తెలిసేలోపు నా దరిదాపు మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా
మబ్బులో పైరులా
మన్నులో తారలా
దిక్కులే ఒక్కటై చేరగా
ఇలా కొత్తగా… ఇదో వింతగా
మొదలైందిగా మన కథా
ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ
చరణం-2
అంతా నాదే అన్నీ నేనే అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా
అంతల్లోనే ఉన్నట్టుండి గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున
చేతిలో గీతలా
కాగితం కవితలా
రాతలే నేడిలా కలిసేగా
ఇలా కొత్తగా… ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా…
Oh Manamey song is from the & English movie.
Oh Manamey song was sung by Geetha Madhuri & Sri Krishna.
Oh Manamey song lyrics were written by Krishna Kanth.
Oh Manamey song music was composed by Hesham Abdul Wahab.