
| Movie Name | & English |
|---|---|
| Director | Mohana Krishna Indraganti |
| Star Cast | Sudheer Babu, Aditi Rao Hydari |
| Music | Vivek Sagar |
| Singer(s) | Chaitra |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Aditya Music |
కనులలో తడిగా నీతో విడిగా
ఒంటిగా మిగిలా కరిగే కథగా
నువు లేనిదే ఇక నేనెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా… నీతో విడిగా
ఒంటిగా మిగిలా… కరిగే కథగా
ఏదీ ఆ క్షణం… ఏదీ ఆ గతం
నా మది వెతుకుతున్నది
ఏ దరి తోచక… నిలిచిన జీవితం
బరువై బ్రతుకుతున్నదీ
అనలేని మనసేమో లోలోపల
ఆవేదనౌతున్న వేళ
నా నిజం తెలిపేదెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా… నీతో విడిగా
ఒంటిగా మిగిలా… కరిగే కథగా
కలిసేదెందుకు విడిపోయేందుకా
తెలిసీ తెలియకున్నదీ
ఎడబాటన్నది… ఎవరికి వేడుక
మనసే అడుగుతున్నదీ
అలలాగ గగనాలకెగిరే కల
విరిగింది విలయాలు తాకి
గాయమై గడిపేదెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా… నీతో విడిగా
ఒంటిగా మిగిలా… కరిగే కథగా
Kanulalo Thadiga song is from the & English movie.
Kanulalo Thadiga song was sung by Chaitra.
Kanulalo Thadiga song lyrics were written by Ramajogayya Sastry.
Kanulalo Thadiga song music was composed by Vivek Sagar.