
| Movie Name | & English |
|---|---|
| Director | E. Satthi Babu |
| Star Cast | Srikanth, Sravanthi |
| Music | Vidyasagar |
| Singer(s) | Gopal & Sreenidhi |
| Lyricist | Chandra Bose |
| Music Label |
ఒట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా
నువ్వంటే నేనేననీ
అడుగేసి వస్తున్నా… ఎందాకైనా ఎవైనా
నీ వెంటే ఉండాలనీ
తీరిందమ్మా ఆరాటం… దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే… నా జాతకం
అందిందమ్మ అనుబంధం… ఏవో జన్మల ఋణబంధం
నీ ఒళ్ళో వాలిందే… నా జీవితం
ఒట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా
నువ్వంటే నేనేననీ
అడుగేసి వస్తున్నా… ఎందాకైనా ఎవైనా
నీ వెంటే ఉండాలనీ
వెళ్ళేటి దారుల్లోన నీడుంటే చాలనుకుంటే
బంగరు మేడై కలిసొచ్చావే
వేచేటి కన్నుల్లోన… కలలుంటే చాలనుకుంటే
కమ్మని నిజమై కనిపించావే
దీవెన చాలని అనుకుంటే… దైవం అందెనే
పూజకు రమ్మని పిలుపిస్తే… ప్రాణం పంచెనే
నా రాతే మార్చేసే… నా గీతే దిద్దేసే
భామిని ఉండగ బ్రహ్మెందుకో
ఒట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా
నువ్వంటే నేనేననీ
మ్ మ్, అడుగేసి వస్తున్నా… ఎందాకైనా ఎవైనా
నీ వెంటే ఉండాలనీ
నీ లేతపాదాలంటే ధూళైతే చాలనుకుంటే
పాపిట తిలకమే చేశావమ్మా
ఆ ఆ, నీ పెరటితోటల్లోన… గాలైతే చాలనుకుంటే
ఊపిరిలో నను నిలిపావమ్మా
నాలో నేడే వెలిగిందే ఆశాదీపము
ప్రేమే మనకు అందించే ఆశీర్వాదము
నీ మెళ్ళో ముళ్ళేసి… పల్లెల్లో ఇల్లేసి
జతపడి బ్రతకని జన్మెందుకో
ఒట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా
నువ్వంటే నేనేననీ
అడుగేసి వస్తున్నా… ఎందాకైనా ఎవైనా
నీ వెంటే ఉండాలనీ
తీరిందమ్మా ఆరాటం… దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే… నా జాతకం
అందిందమ్మ అనుబంధం… ఏవో జన్మల ఋణబంధం
నీ ఒళ్ళో వాలిందే… నా జీవితం
Ottesi Cheputunna song is from the & English movie.
Ottesi Cheputunna song was sung by Gopal & Sreenidhi.
Ottesi Cheputunna song lyrics were written by Chandra Bose.
Ottesi Cheputunna song music was composed by Vidyasagar.