
| Movie Name | & English |
|---|---|
| Director | Brinda |
| Star Cast | |
| Music | Govind Vasantha |
| Singer(s) | Aravind Srinivas |
| Lyricist | Rambabu Gosala |
| Music Label | Sony Music South |
అలలెగసె సంద్రపు తీరం
చిరుజల్లులు కురిసే తరుణం
చిరుగాలికి ఉయ్యాలూగె పువ్వుని చూసానే
శిలలేమో చేసే నాట్యం
సిరిమువ్వలు వీడెను మౌనం
ఊరించే నీ చిరునవ్వుల రూపం కన్నాలే
మేఘంలా పరుగులు తీస్తూ
గాల్లోనే గంతులేస్తూ
మైమరిచి ఆడి పాడి
హృదయం ప్రేమలో తేలిపోయే
మబ్బుచాటు వెన్నెలమ్మ
నింగి దాటి నేలకొచ్చె
గూటినొదిలి గువ్వలేమో
ఆకాశాన్ని చుట్టేసే
కళ్ళతోటి కౌగిలించి
తియ్యనైన ముద్దిస్తే
మధురమైన తేనెలొలికి
దేహమింక తపియించె
వాసంతం మదిలో చేరి
పువ్వులలే ప్రేమను చల్లే
ఇపుడే నా లోకం అంతా
కొత్తగ మార్చావే
ఎద నదిలో చేపగా మారి
అలజడిలా నాలో తుళ్ళే
నీ అందం వినువీధుల్లో
తారై మెరిసేనే
చూపుల్తో చూపులు కలిసే
హృదయంతో హృదయం కలిసే
పెదవుల్తో పెదవులు కలిసే
నాలో ప్రాణం నీలో కలిసే
మబ్బుచాటు వెన్నెలమ్మ
నింగి దాటి నేలకొచ్చె
గూటినొదిలి గువ్వలేమో
ఆకాశాన్ని చుట్టేసే
కళ్ళతోటి కౌగిలించి
తియ్యనైన ముద్దిస్తే
మధురమైన తేనెలొలికి
దేహమింక తపియించె
మబ్బుచాటు వెన్నెలమ్మ
నింగి దాటి నేలకొచ్చె
గూటినొదిలి గువ్వలేమో
ఆకాశాన్ని చుట్టేసే
కళ్ళతోటి కౌగిలించి
తియ్యనైన ముద్దిస్తే
మధురమైన తేనెలొలికి
దేహమింక తపియించె
మబ్బుచాటు వెన్నెలమ్మ
నింగి దాటి నేలకొచ్చె
గూటినొదిలి గువ్వలేమో
ఆకాశాన్ని చుట్టేసే
కళ్ళతోటి కౌగిలించి
తియ్యనైన ముద్దిస్తే
మధురమైన తేనెలొలికి
దేహమింక తపియించె
Alalegase song is from the & English movie.
Alalegase song was sung by Aravind Srinivas.
Alalegase song lyrics were written by Rambabu Gosala.
Alalegase song music was composed by Govind Vasantha.