
| Movie Name | & English |
|---|---|
| Director | MSR |
| Star Cast | Varun Sandesh & Farnaz Shetty |
| Music | Shiva Kakani |
| Singer(s) | SP Charan & Sahithi Chaganti |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label | Infinitum Music |
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా
చెంపల్లోన సిగ్గునడిగి చూడు
ముద్దుల్లోనా వేడినడిగి చూడు
నిన్నే నాలో గుర్తుపట్టి చూడు… తనివి తీరగ
నువ్వు చూడు చూడు అంటే… మనసు ఆగదే
నిన్ను చూడకుండ ఉంటే… ఏమి తోచదే, అసలేమి తోచదే
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా
గురుతైన లేదు కదా… నువ్వు లేని జీవితం
మరుపైన రావు కదా… ఒక్క నిమిషం
నీ రాకతోనే కదా… మారిపోయే జాతకం
నీ తోడులోనే కదా.. నేను నవ్వడం
ఈ ప్రేమ జీవనది… ఇద్దరము కలిసి ఈదుదాం
ఏ కన్ను చూడలేని.. కొత్తలోకం కలిసి వెతుకుదాం
కోరికేదో బాగున్నది… కొత్తగ ఉన్నది
పిచ్చి ప్రేమేదో ప్రేమేదో అందుట్లో దాగున్నది
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా
ఆనందమెక్కడున్న… జల్లెడేసి పట్టనా
నీ కాలి మువ్వలాగ తెచ్చి కట్టనా
తేనీగలెక్కడున్నా వెంటపడి అడగనా
ఆ తీపి అద్దుకొని ముద్దులెట్టనా
నువ్వంటే ఇందువలే అందువలే నాకు ఇష్టమే
నువ్వింత ఆశ పెట్టి… చంపుతుంటే అడ్డుచెప్పనే
నన్ను వచ్చి అల్లేసుకొ పట్టి లాగేసుకో
నిండు నూరేళ్ళు నూరేళ్ళు నీలోనే దాచేసుకో
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా
Induvadana Kallalloki song is from the & English movie.
Induvadana Kallalloki song was sung by SP Charan & Sahithi Chaganti.
Induvadana Kallalloki song lyrics were written by Bhaskara Bhatla.
Induvadana Kallalloki song music was composed by Shiva Kakani.