Aahwanam Srirastu Song Lyrics: Aahwanam Srirastu is a Telugu song from the film & English starring Srikanth, Ramya Krishna, Heera, directed by S V Krishna Reddy. "Aahwanam Srirastu" song was composed by S V Krishna Reddy and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.
Aahwanam Srirastu Song Details
Movie Name
& English
Director
S V Krishna Reddy
Star Cast
Srikanth, Ramya Krishna, Heera
Music
S V Krishna Reddy
Singer(s)
S P Balasubramanyam, Chitra
Lyricist
Sirivennela Seetharama Sastry
Music Label
Volga Video
Aahwanam Srirastu Song Lyrics in Telugu
హా సువ్వి… ఆహా సువ్వి
హా సువ్వి… ఆహా సువ్వి
ఆకాశం పందిరి వేసింది… ఈ నేలమ్మ పీటను వేసింది
జరిగే వైభోగం రమ్మంది… జనులారా కనులారా చూడండి
మంగళవాద్యాలు పిలుపులు అందించగ
ముంగిట మురిపాలు కళకళలాడగ
పచ్చగ పెళ్ళయ్యే ముహూర్తమె తథాస్తంది
ఆకాశం పందిరి వేసింది
ఈ నేలమ్మ పీటను వేసింది
హా సువ్వి… ఆహా సువ్వి
హా సువ్వి… ఆహా సువ్వి
నలుగురూ చేరి నలుగుపెట్టరే
చిన్నారిని జలకాలాడించరే
ముద్దుగా ముస్తాబును చెయ్యరే
బుగ్గమీద పెళ్ళిచుక్క దిద్దరే
వరుడితొ మగపెళ్ళివారు… తయ్యారు
విడిదికి వియ్యాలవారు… వచ్చారు
మనవిని మన్నించి… మనువుకి రండయ్యా, ఆ ఆఆ
పప్పన్నం పెడతాం… దయచేయండయ్యా
అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా
ఆకాశం పందిరి వేసింది
ఈ నేలమ్మ పీటను వేసింది
హా సువ్వి… ఆహా సువ్వి
హా సువ్వి… ఆహా సువ్వి
గౌరీపూజను చేసి… చేసి
నీ కోసం నోములు నోచి… నోచి
కులుకుల కాణాచి… అదిగో వచ్చింది, ఈ ఈఈ
తెరవెనుకన వేచి… కలలే కంటోంది
పరిణయ ప్రమాణమే… చేసి పొందమంటోంది
ఆకాశం పందిరి వేసి… ఈ నేలమ్మ పీటను వేసింది
ధర్మే త్వయా యేశ నాతిచరితవ్యా
(ధర్మే త్వయా యేశ నాతిచరితవ్యా)
అయ్య..! నాతిచరామి అనండి… నాతిచరామి
అర్థేత్వయా యేశ నాతిచరితవ్యా
(అర్థేత్వయా యేశ నాతిచరితవ్యా)… నాతిచరామి
కామేత్వయా యేశ నాతిచరితవ్యా
(కామేత్వయా యేశ నాతిచరితవ్యా)… నాతిచరామి
అయ్యా ఈ మంత్రాలు అంటున్నారు అనమంటున్నారుగాని, మరి వాటికి అర్థాలు తెలియాలి కదండీ చెబుతారా? అలాగే..!
ధర్మార్థకామములలోన ఏనాడూ, ఈమె తోడును నీవు విడిచిపోరాదు.
నీ బాస చేసి ఇక నిండు నూరేళ్ళు, ఈ సతికి నీడవై నిలిచి కాపాడు.
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!!
నా జీవితానికే అధారము… అయి నిన్నుఅల్లింది ఈ దారం
నీ మెడను వాలు ఈ మాంగల్యము… నా శాంతి సౌఖ్యముల సంకేతము
ఈ సూత్రముతో నీవు చిరకాలము… వర్ధిల్లితే నాకు అది క్షేమము