
| Movie Name | & English |
|---|---|
| Director | Sateesh Paramaveda |
| Star Cast | Suman Tej, Garima Chouhan |
| Music | Charan Arjun |
| Singer(s) | Armaan Malik |
| Lyricist | Charan Arjun |
| Music Label | T-Series Telugu |
లాగేసావే నన్ను లాగేసావే
నీ గలగల నవ్వుల గాలం వేసి లాగేసావే.
లాగేసావే నన్ను లాగేసావే
ఓ మిణుగురులా తొలి వెలుగులు చూపి లాగేసావే.
నిన్న లేని ఈ మాయే
నిన్ను చూసి మొదలాయే
నిన్న లేని ఈ మాయే
నిన్ను చూసి మొదలాయే.
కళ్ళతోనే అల్లేసి
నను కట్టి పడేసావే
వెళ్ళనీకా నా చుట్టూ
ఘన కంచెలు వేసావే
నువ్ గడసరివే, సొగసరివే
గమ్మత్తుగ నను మొత్తం నువ్వే
లాగేసావే నన్ను లాగేసావే
నీ గలగల నవ్వుల గాలం వేసి లాగేసావే.
నిన్న లేని ఈ మాయే
నిన్ను చూసి మొదలాయే…
ఎవ్వరే నువు ఎవ్వరే
ఎడారిలాంటి నా హృదయంలో
పువ్వై పూసావు.
ఎవ్వరే నువు ఎవ్వరే
గుడారమేసి నా గుండెల్లో
స్థిరపడుతున్నావు…
ఇంతకిది నిజమేనా
కాంత నువ్ కలవేనా
ఎంత గీ పెడుతున్నా
తేలనీ తగువైనా.
దేవతలకే దేవత నువ్వని అనిపిస్తున్నాదే
నా జీవితంలో ఇంతానందం ఎన్నడూ లేదే
నువ్ గడసరివే, సొగసరివే
గమ్మత్తుగ నను మొత్తం నువ్వే
లాగేసావే నన్ను లాగేసావే
నీ గలగల నవ్వుల గాలం వేసి లాగేసావే.
ఎన్నడే అసలెన్నడే
ఓ సక్కనమ్మా నా పక్కనే నువ్
కూర్చొని నవ్వేది
అన్నదే, కవులన్నదే
జంటవ్వకుండా మంటైపోతే
జన్మకు విలువేదీ
అంత విసుగైపోకు
కొంత ఇది అతి నీకూ
నిన్ను గెలవాలంటే
తప్పదీశ్రమ నాకూ.
నేను అయితే రామచంద్రుడు
అవును కాదానే
నువ్వు అయితే
సీతమ్మ తల్లేనే.
నువ్ గడసరివే, సొగసరివే
గమ్మత్తుగ నను మొత్తం నువ్వే
లాగేసావే నన్ను లాగేసావే
నీ గలగల నవ్వుల గాలం వేసి లాగేసావే.
నిన్న లేని ఈ మాయే
(నిన్న లేని ఈ మాయే)
నిన్ను చూసి మొదలాయే
(నిన్ను చూసి మొదలాయే).
Lagesave song is from the & English movie.
Lagesave song was sung by Armaan Malik.
Lagesave song lyrics were written by Charan Arjun.
Lagesave song music was composed by Charan Arjun.