
| Movie Name | & English |
|---|---|
| Director | V.V. Vinayak |
| Star Cast | Megastar Chiranjeevi, Kajal Aggarwal |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Shankar Mahadevan |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Lahari Music | T-Series |
Neeru Neeru Lyrics in Telugu
నీరు… నీరు… నీరు
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గుండెలన్ని బీడు
ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ
అన్నదాత గోడు… నింగినంటె నేడు
ఆలకించు వారు ఎవ్వరూ, ఓ ఓ
నీరు… నీరు… నీరు
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గొంతు ఎండిపోయే
పేగు మండిపోయే
గంగతల్లి జాడ లేదనీ
నీటి పైన ఆశే నీరుగారి పోయే
రాత మారు దారి లేదనీ
దాహమారుతుందా
పైరు పండుతుందా
ధారాలైన కంటి నీటితో, ఓ ఓ
నీరు… నీరు… నీరు
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గుండెలన్ని బీడు
ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ
నేల తల్లి నేడు అంగిలారిపోయే
మూగబోయే రైతు నాగలీ
ఆయువంతా చూడు ఆర్తనాదమాయే
గొంతు కోసుకుంది ఆకలీ
Neeru Neeru song is from the & English movie.
Neeru Neeru song was sung by Shankar Mahadevan.
Neeru Neeru song lyrics were written by Ramajogayya Sastry.
Neeru Neeru song music was composed by Devi Sri Prasad.