
| Movie Name | & English |
|---|---|
| Director | Sriram Adittya |
| Star Cast | Akkineni Nagarjuna, Nani, Rashmika, Aakanksha Singh |
| Music | Mani Sharma |
| Singer(s) | Sid Sriram & Ramya Behra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
ఏమో ఏమో ఏమో
మెరుపుతీగ ఎదురై నవ్విందేమో
ఏమో ఏమో ఏమో
వెలుగువాగు నాలో పొంగిందేమో
ఉందో లేదో ఏమో
కాలి కింద నేలే కరిగిందేమో
మాయో మహిమో ఏమో
నేలకాస్త నింగై మెరిసిందేమో
ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే
ఇలాంటిదేదో ఉన్నదంటే విన్నమాట కాదే
రాదే రాదే రాదే
నెమలి కన్ను కలలో రూపం నీదే
రాదే రాదే రాదే
ఎడమవైపు ఎదలో దీపం నీదే
లేదే లేనే లేదే
ఇంత గొప్ప అందం… ఇలలో లేదే
ఉండే ఉంటే ముందే
చూసినట్టు ఎవరూ అననే లేదే
పోల్చేదెలా ఇలా అని
నీలాగా ఉంది నువ్వే
నమ్మేదెలా నిజం అని
సమ్మోహ పరచినావే
ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఏ ఏ ఏఏ ఏ
లాలి లాలి అంటూ
జోల పాట పాడే… పవనం నువ్వే
లేలే లేలే అంటూ
మేలుకొలుపు పాడే… కిరణం నువ్వే
నాలో భావం నువ్వే
రూపు కట్టి ఇల్లా ఎదురయ్యావే
నాలో జీవం నువ్వే
ఆశ పెట్టి నన్నిలా కవ్విస్తావే
లోలోన దాచుకున్న
నా అందాల ఊహ నువ్వే
నా చెంత చేరి ఇంతలా
దోబూచులాడినావే
ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఊ ఊఊ ఊఊ ఉ
Emo Emo Emo Devadas song is from the & English movie.
Emo Emo Emo Devadas song was sung by Sid Sriram & Ramya Behra.
Emo Emo Emo Devadas song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Emo Emo Emo Devadas song music was composed by Mani Sharma.