
| Movie Name | Christian |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Pranam Kamlakhar |
| Singer(s) | Mohammad Irfan |
| Lyricist | Joshua Shaik |
| Music Label | Joshua Shaik Ministries OFFICIAL |
ఎవరు చూపించలేనీ
ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ
ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
ఎవరు చూపించలేనీ
ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ
ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
నీ కథే నన్నే తాకగా
నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా
నీ దరే నే చేరానుగా
||ఎవరు చూపించలేనీ||
తీరాలే దూరమాయే
కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే
కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన
నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక
నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా… ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా… యేసయ్య నీవెగా
ఎవరు చూపించలేనీ
ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ
ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
ఈ లోక జీవితాన
వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం
వెలిగించె నా ప్రాణం
నీ సన్నిథానమందు
సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే
నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో
సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె
నా యేసయ్య
ఎవరు చూపించలేనీ
ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ
ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
Yevaru Choopinchaleni song is from the Christian movie.
Yevaru Choopinchaleni song was sung by Mohammad Irfan.
Yevaru Choopinchaleni song lyrics were written by Joshua Shaik.
Yevaru Choopinchaleni song music was composed by Pranam Kamlakhar.