
| Movie Name | Christian |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Surendra Chinni |
| Singer(s) | Pas.K.Parishuddarao |
| Lyricist | Rev.M Prasanth Raju |
| Music Label |
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను
ధవళవర్ణుడు, రత్న వర్ణుడు నా ప్రియుడు ||2||
అవని పదివేలందు… అతి శ్రేష్ఠుడాతండు ||2||
ఎవరు ఆయనకిలలో… సమరూప పురుషుండు ||2||
అవలీలగా నతని గురితింపగలనమ్మా ||2|| //ఎంతో//
కురులు నొక్కులు కల్గి… స్ఫురద్రూపియగు విభుడు||2||
మరులు మనసున నింపు… మహనీయుడాతండు||2||
సిరులు కురిపించేను… వర దేవ తనయుండు||2||
విరబూయు పరలోక షారోను విరజాజి ||2|| //ఎంతో//
పాలతో కడిగిన… నయనాలు గలవాడు ||2||
విలువగు రతనాల వలె… పొదిగిన కనులు ||2||
కలుషము కడిగిన… కమలాల కనుదోయి ||2||
విలువైన చూపొసగె… వరమేరి తనయుండు ||2|| //ఎంతో//
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన ||2||
చలువ రాతిని బోలు… బలమైన పాదాలు ||2||
ఆ లెబానోను సమారూప వైఖరి, ఆ ఆ ||2||
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు ||2|| //ఎంతో//
అతడతికాంక్షానీయుండు తనయుండు ||2||
అతడే నా ప్రియుడు… అతడే నా హితుడు ||2||
ఆతని నొరతి… మధురంబు మధురంబు ||2||
ఆతని పలు వరుస… ముత్యాల సరి వరుస ||2|| //ఎంతో//
Entho Sundarudamma Thanu song is from the Christian movie.
Entho Sundarudamma Thanu song was sung by Pas.K.Parishuddarao.
Entho Sundarudamma Thanu song lyrics were written by Rev.M Prasanth Raju.
Entho Sundarudamma Thanu song music was composed by Surendra Chinni.