
| Movie Name | Love Failure (2020) |
|---|---|
| Director | Shanthi Raj |
| Star Cast | Gani & Pavani |
| Music | Indrajitt |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే..
కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే…
మళ్ళీరా ఇలా.. గుండె ఆగిపోయేలా ఉందే..
ఓ.. మళ్ళీరా ఇలా.. గుండె ఆగిపోయేలా ఉందే..
నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే..
కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే…
నిలుసున్న సోటే నాకు నేనే.. నిప్పై మండేనా.. తప్పు నాదే..
నా కన్నీరు జారేటి దారుల్లోన.. బాధంతా రగిలింది గుండెల్లోనా…
నన్ను వీడను అంటూనే. నా నీడను ధాటినావే..
కన్ను సూడకుంట నిన్ను నే.. ఊపిరి ఉండలేను అన్నదే..
ఆ నీలి నింగిలోనా.. నువ్వు ఏడ ఉన్నావే..
నే కన్నా కలలోన ఎడబాటైనావే…
నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే..
కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే…
నా గుండెల్లో ఆయువు నువ్వే కదా.. సావు లేని ప్రేమ నాదే కదా
ఇది దేవుడు ఆడేటి ఆట కదా.. నుదుటిపై రాసేటి రాత కదా..
నువ్వు వీడి వెళ్ళిపోతావే.. నా గుండె ఘోష చూడవే..
నువ్వు తోడు లేని చావులో.. నేను ఒంటరిని అయ్యానే…
ఆ నల్ల మబ్బులోన.. నా చందమామ నువ్వే..
నా సావు సివరిలోన.. నే తలసుకున్న నిన్నే…
నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే..
కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే…
Nade Nade Thappantha song is from the Love Failure movie.
Nade Nade Thappantha song music was composed by Indrajitt.