
| Movie Name | Love Failure |
|---|---|
| Director | Ganu |
| Star Cast | |
| Music | Madeen SK |
| Singer(s) | Hanumanth Yadav |
| Lyricist | Ganu |
| Music Label |
మనసిచ్చిన అమ్మాయినే మనువాడలేనప్పుడు
ప్రేమించిన అమ్మాయితోని జీవించలేనప్పుడు
నా ప్రాణాలు ఎందుకమ్మా
నీ పక్కన నేనే లేనప్పుడు
నేను బతికుండుడెందుకమ్మా
నా బతుకంత నీతోని కానప్పుడు
ఊరంత సుట్టాలే నీ పెండ్లికి
వందేళ్ళ కన్నీళ్ళు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయే నా బాధకి
ఊరంత సుట్టాలే నీ పెండ్లికి
వందేళ్ళ కన్నీళ్ళు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయే నా బాధకి
మనసిచ్చిన అమ్మాయినే మనువాడలేనప్పుడు
ప్రేమించిన అమ్మాయితోని జీవించలేనప్పుడు
నా ప్రాణాలు ఎందుకమ్మా
నీ పక్కన నేనే లేనప్పుడు
నేను బతికుండుడెందుకమ్మా
నా బతుకంత నీతోని కానప్పుడు
నువ్వు తలమీద ఒట్టేసి
చెప్పిన మాటలు జిలకర బెల్లమమ్మా
నువ్వు నాతోని వేసిన అడుగులన్ని
ఏడు అడుగులే బంగారమా
నువు ప్రేమతో వెట్టిన ముద్దులన్నీ
మోసమేనా నా ప్రాణమా
నీకు ఇన్నాళ్ళ మన ప్రేమ జ్ఞాపకాలన్నీ
గురుతులేవ బొమ్మా
నిన్ను ప్రాణంగ ప్రేమించితే
నా ప్రాణాలతో ఆడుకున్నావుగా
పిచ్చిగా నిన్ను ప్రేమించితే
నన్ను పిచ్చోణ్ణి చేసే పోయావుగా
నాపిల్లనే నన్ను వద్దన్నది అంటు
అందరికి సెప్పుకోలేనుగా…!!
ఊరంత సుట్టాలే నీ పెండ్లికి
వందేళ్ళ కన్నీళ్ళు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయే నా బాధకి ||2||
కన్నతల్లి సచ్చిపోతున్నగానీ
కన్నీళ్ళు రానప్పుడు
ప్రేమించినమ్మాయి వదిలేసిపోతే
సచ్చేంత భాదెందుకు?
నువ్వు ఏ బాధ లేకుండ
ఇంకోనితోని నవ్వుతు ఉన్నప్పుడు
నేను నీ కోసమేడుస్తు కన్నీళ్ళు కారుస్తు
చస్తున్ననే ఎందుకు?
నా ప్రాణాన్ని అడిగి ఉంటే
నవ్వుతూ నీ కోసం ఇచ్చేటోన్నే
ప్రేమ లేదంటు సెప్పి ఉంటే
నీ నీడకైన దూరం ఉండేటోన్నే
అందాల పెళ్లి పందిరిలో
ఓ బంగారు బొమ్మ నువ్వేనే
నీ పెళ్ళికి రావాలి… అక్షింతలు వెయ్యాలి
పెళ్లి డప్పులు మోగాలి
నీ పెళ్ళికి మోగిన డప్పులతో
నా సావును జెయ్యాలి
ఊరంత సుట్టాలే నీ పెండ్లికి
వందేళ్ళ కన్నీళ్ళు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయే నా బాధకి ||2||
Love Failure Songs song is from the Love Failure movie.
Love Failure Songs song was sung by Hanumanth Yadav.
Love Failure Songs song lyrics were written by Ganu.
Love Failure Songs song music was composed by Madeen SK.