
| Movie Name | Love Failure |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Kalyan Keys |
| Singer(s) | Hanumanthu Yadav |
| Lyricist | Suresh Kadari |
| Music Label | Ashok tunes |
పొలిమేర పోషమ్మ సాక్షిగా
నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే
గడిమీది గుండ్రాయి అంచుకు
నీపేరు నాపేరు కలిపి రాస్తివే
ఊరంత దెలిసేటట్టు
నా సెయ్యి నువ్ బట్టి నడిసినవే
మనసంతా మురిసేటట్టు
మన జంట ఉందని జెప్పినవే
మీ అమ్మ నాన్న తోని
మాటాడి ఒప్పిస్తనంటివే
సూరీడు పొడిసేలోగా
ఉరికొయ్యకేలాడుతుంటివే
జాలి లేని దేవుడా ఎంత పని జేత్తివిరా
నమ్ముకున్న ప్రేమనే నా నుండి ఎత్తుకపోతివిరా
పాపకారి దేవుడా ఓర్వలేకపోతివిరా
ఒంటరోన్ని జేసి నన్ను నాతోడు తీసుకపోతివిరా
ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
ఏమి పాపము నేను జేసినానురా
ఎందుకింత బాధ నాకు సూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
పొలిమేర పోషమ్మ సాక్షిగా
నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే
గడిమీది గుండ్రాయి అంచుకు
నీపేరు నాపేరు కలిపి రాస్తివే
నా ఇంటిలోన దొరసాని మల్లె
నువ్వంటవనుకున్ననే
నీ పాదాల పక్కన పాలేరు మల్లె
నేనుంటే సాలంటినే
నీ కంట కన్నీరు రానియ్యకుండా
నిన్ను చూసుకుందునే
కోరింది ఇచ్చి నీముందు ఉంచి
నిన్ను ఏలుకొందునే
ఊపిరే లేని నిన్ను చూసి నేను ఏమౌదునే
ఆశలన్ని ఆవిరి జేసి నువ్వేబోతే ఎట్టుందునే
మాట ఇచ్చి మౌనమై నువ్వున్నావు ఎందుకనే
మట్టిలోన ప్రేమ కలిపి కన్నె మూసి నువ్వున్నవే
ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
ఏమి పాపము నేను జేసినానురా
ఎందుకింత బాధ నాకు సూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
నా గుండె సెరువై మోయని బరువై
కన్నీరు వెట్టుకుంది
నువు లేక నేను ఇంకెదుకాని
కాటికి జేరుకుంది
నిను జూసి కళ్ళల్లో కన్నీరు కడలై
ఉప్పొంగిపోత ఉంది
నిను జేరమంటు నా మనసు నాతో
మొరపెట్టుకుంటా ఉంది
బూడిదల్లే మారి నీతో వత్తాను అంటున్నదే
నువ్వు లేని లోకమే నాకెందుకంటున్నదే
చావులోన నీకు తోడు నేనుంటనంటున్నదే
కాలుతున్న సెయ్యి ఇడువ కంగారు పడకన్నదే
ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
ఏమి పాపము నేను జేసినానురా
ఎందుకింత బాధ నాకు సూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
Jali Leni Devuda song is from the Love Failure movie.
Jali Leni Devuda song was sung by Hanumanthu Yadav.
Jali Leni Devuda song lyrics were written by Suresh Kadari.
Jali Leni Devuda song music was composed by Kalyan Keys.