
| Movie Name | Love Failure |
|---|---|
| Director | Bullet Bandi Laxman |
| Star Cast | |
| Music | Kalyan Keys |
| Singer(s) | Ramu |
| Lyricist | Bullet Bandi Laxman |
| Music Label |
మందు లేని గాయమే చేసి పోయినావే
మంట ఓర్చుకోనిదే నా కంటనీరు ఆగదే
మందు లేని గాయమే చేసి పోయినావే
మంట ఓర్చుకోనిదే నా కంటనీరు ఆగదే
తప్పేలే తప్పేలే
ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించా
తప్పంతా నాదేలే
తప్పేలే తప్పులే
నా జన్మంతా నీ చెంత అనుకున్న
తప్పంతా నాదేలే
అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే
అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే
అందరిలాగే నేను నిన్ను కోరుకోనే
బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
అనుకున్నా నేను నీ మెడలో మెరిసే తాళనీ
అనుకోలేదే నీ పెళ్ళిలో అతిధి నేనని
రాసుకున్నా నా నెత్తుటితో ప్రేమ లేఖ
నాకు ఇచ్చావే రమ్మని నీ పెళ్లి పత్రిక
నీ చుట్టుముట్టున అతిధులు
అందులోనే నీ నవ్వులు
నీ పక్కనున్నోడి మునివేళ్ళు
నీకు వేస్తూ ఉంటె మూడు ముళ్ళు
చూడలేకే నేను చచ్చి బతికానే
కన్నీటి అక్షింతలేశానే
బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
అనుకున్నానే నా నుదుటి రాత నువ్వనీ
చూస్తున్నానే బ్రతుకంటే ఇంతేనేమనీ
అనుకున్నానే నా ఇంటిదీపమే అనీ
చూస్తున్నానే ఆ ఇంటి వెలుగు నువ్వనీ
పువ్వులు అల్లిన కారులోన
ఊరేగుతున్నావే చిన్నదాన
ఊపిరి ఆగేటి బాధలోనా
చిందులేస్తున్నానే పిచ్చివాన్నా
తట్టుకోలేని బాధే నాకున్నా
సంతోషంగా నిన్ను సాగనంపుతున్నా
బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
Bagundalamma song is from the Love Failure movie.
Bagundalamma song was sung by Ramu.
Bagundalamma song lyrics were written by Bullet Bandi Laxman.
Bagundalamma song music was composed by Kalyan Keys.