Movie Name | Love failure song (2024) |
---|---|
Director | Shiva Krishna Velthuru |
Star Cast | Akshith Marvel |
Music | Venkat Ajmeera |
Singer(s) | Divya Malika & Hanumanth Yadav |
Lyricist | Divya Bonagiri |
Music Label | Oormi Love Songs |
Director Shiva Krishna Velthuru
Producer Nivriti Vibes
Lyrics Divya Bonagiri
Singers Divya Malika & Hanumanth Yadav
Music Venkat Ajmeera
Artists Akshith Marvel, Reenu Sk & Vaanya Agarwal
Song Lable
Oormi Love Songs
Song
Love Failure Songs
ఏడేడు లోకాలు ఏలేటి రాముడు
అడవుల్లో సీతమ్మనొదిలేసినట్టు
పతి యంటు సతి యంటు
మురిసిన రాధని వదిలేసి
రుక్మిణిని పెళ్ళాడినట్టూ
పార్వతి ఉండగ ఆలిగా
గంగనే ఎంచుకున్నాడు తోడుగా
ప్రేమనే మాటని నేడుగా పెంచుకుంటె
ప్రాణమే పోయెగా…
ఏడేడు లోకాలు ఏలేటి రాముడు
అడవుల్లో సీతమ్మనొదిలేసినట్టు
పతి యంటు సతి యంటు
మురిసిన రాధని వదిలేసి
రుక్మిణిని పెళ్ళాడినట్టూ
బంధమంటు మా బతుకు మర్సి
మాతో ఆటలే ఆడుతవో
భారమైన ఓ బరువునిచ్చి
బతుకు ఆగంలో తోసేస్తివో
వేడుకుందునా ఏడుకొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్ల సెప్పురా ఓ దేవ నా ప్రేమ
దయ్యాల పాలాయనో
వేడుకుందునా ఏడుకొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్ల సెప్పురా ఓ దేవ నా ప్రేమ
దయ్యాల పాలాయనో
ఓ సిననాడు నీ ఎంట తిరిగినా
వింత సిత్రమే గడిసే
సేతుల్లో సెయ్యేసి సెప్పిన ఆ మాట
ఈరోజు ఎటు పాయెనే
గుండెల్లో లోతుల్లో గంజాయి ఘాటోలే
నిండినావే నువ్వు నేనేమి సేత్తు
నడి రేయి సీకట్ల నువు లేక నేనిట్ల
సచ్చి శవమైతినే నీ మీద ఒట్టు
ఏదైతే నేమి సూపులో సావు దెబ్బ కొట్టి
సూసి పోకలా
ఈ సేతి గీత తాకె వేళనా
నన్ను సంపిన సంతోషమే గదా
వేడుకొందునా ఏడుకొండల సామి
ఈ గోసలే ఏందిరో
ఎట్ల సెప్పురా ఓ దేవ
నా ప్రేమ సిక్కుల్ల తోసేస్తివో
వేడుకొందునా ఏడుకొండల సామి
ఈ గోసలే ఏందిరో
ఎట్ల సెప్పురా ఓ దేవ
నా ప్రేమ సిక్కుల్ల తోసేస్తివో
సిక్కుల్ల తోసేస్తివో…
పరువాలేదమ్మో నీ మాట నేనే
మళ్ళీ వస్తానన్న ఆ మాటలన్నీ
మరిసిపోదమ్మో ఈ పిచ్చి గుండె
సచ్చేదాకా నీకై పిచ్చోన్నే గాని
తేనెల కత్తులే పూసినా
నాకే గుచ్చినావే గుర్తులేననా
ఈ మట్టిలో కలిసానే ఘోరిలా
మచ్చలెన్నో వెట్టి మరిసిపోతివా
దండాలెన్నో వెట్టుకున్నదే వీళ్ళకు
దండి బాధలిచ్చెనో
దగ్గరలేవని తెలిసిన దేవుడే
దిక్కులన్ని తిప్పెను
వేడుకుందునా ఏడుకొండల సామి
నీ ఆటలే ఆపరో
ఎట్ల సెప్పురా ఓ దేవ
నా బతుకు బుగ్గిపాలే జేస్తివో…
వేడుకుందునా ఏడుకొండల సామి
నీ ఆటలే ఆపరో
ఎట్ల సెప్పురా ఓ దేవ
నా బతుకు బుగ్గిపాలే జేస్తివో
బుగ్గిపాలే జేస్తివో……