Movie Name | love failure song (2023) |
---|---|
Director | Suresh Kadari |
Star Cast | Vishwapriya | |
Music | MadeenSk |
Singer(s) | Hanumanth Yadav |
Lyricist | Suresh Kadari |
Music Label | Ashok Tunes |
Song: Jaalileni Devuda Video Song Lyrics , Concept & Direction: Suresh Kadari Music: MadeenSk Singers: Hanumanth Yadav Dop & Editor : Janatha Bablu DI : Sanjeev Mamidi Rainbow Studios Producer: Vallepu Ashok Kumar Posters: sathish nani Department : Chandu yata , ranjith , mallesh Song Performance by Ashok Kumar , Vishwapriya , Anuhya , Ramesh , karishma , ranjith , mallesh
ఆతడు: పొలిమేర పోషమ్మ సాక్షిగా
నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే
గడిమీది గుండ్రాయి అంచుకు
నీపేరు నాపేరు కలిపి రాస్తివే
ఆతడు: ఊరంత దెలిసేటట్టు
నా సెయ్యి నువ్ బట్టి నడిసినవే
మనసంతా మురిసేటట్టు
మన జంట ఉందని జెప్పినవే
ఆతడు: మీ అమ్మ నాన్న తోని
మాటాడి ఒప్పిస్తనంటివే
సూరీడు పొడిసేలోగా
ఉరికొయ్యకేలాడుతుంటివే
ఆతడు: జాలి లేని దేవుడా ఎంత పని జేత్తివిరా
నమ్ముకున్న ప్రేమనే నా నుండి ఎత్తుకపోతివిరా
పాపకారి దేవుడా ఓర్వలేకపోతివిరా
ఒంటరోన్ని జేసి నన్ను నాతోడు తీసుకపోతివిరా
ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
ఏమి పాపము నేను జేసినానురా
ఎందుకింత బాధ నాకు సూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
ఆతడు: పొలిమేర పోషమ్మ సాక్షిగా
నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే
గడిమీది గుండ్రాయి అంచుకు
నీపేరు నాపేరు కలిపి రాస్తివే
ఆతడు: నా ఇంటిలోన దొరసాని మల్లె
నువ్వంటవనుకున్ననే
నీ పాదాల పక్కన పాలేరు మల్లె
నేనుంటే సాలంటినే
ఆతడు: నీ కంట కన్నీరు రానియ్యకుండా
నిన్ను చూసుకుందునే
కోరింది ఇచ్చి నీముందు ఉంచి
నిన్ను ఏలుకొందునే
ఆతడు: ఊపిరే లేని నిన్ను చూసి నేను ఏమౌదునే
ఆశలన్ని ఆవిరి జేసి నువ్వేబోతే ఎట్టుందునే
మాట ఇచ్చి మౌనమై నువ్వున్నావు ఎందుకనే
మట్టిలోన ప్రేమ కలిపి కన్నె మూసి నువ్వున్నవే
ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
ఏమి పాపము నేను జేసినానురా
ఎందుకింత బాధ నాకు సూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
ఆతడు: నా గుండె సెరువై మోయని బరువై
కన్నీరు వెట్టుకుంది
నువు లేక నేను ఇంకెదుకాని
కాటికి జేరుకుంది
ఆతడు: నిను జూసి కళ్ళల్లో కన్నీరు కడలై
ఉప్పొంగిపోత ఉంది
నిను జేరమంటు నా మనసు నాతో
మొరపెట్టుకుంటా ఉంది
ఆతడు: బూడిదల్లే మారి నీతో వత్తాను అంటున్నదే
నువ్వు లేని లోకమే నాకెందుకంటున్నదే
చావులోన నీకు తోడు నేనుంటనంటున్నదే
కాలుతున్న సెయ్యి ఇడువ కంగారు పడకన్నదే
ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
ఏమి పాపము నేను జేసినానురా
ఎందుకింత బాధ నాకు సూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా