Movie Name | Love failure song (2024) |
---|---|
Director | Raj Narendra |
Star Cast | Ganu, Rowdy Megha |
Music | Madeen SK |
Singer(s) | Hanumanth Yadav |
Lyricist | Ganu |
Music Label | Ganu Folks |
కంటినిండా చూడాలంటు కన్నులడిగాయే
మనసునిండా మాట్లాడాలని పెదవులడిగాయే
తనివితీరా తాకాలంటూ చేతులడిగాయే
నీతో సావుదాకా నడవాలంటూ అడుగులడిగాయే
పెళ్ళి జేసుకోని వేరే ఊరు వెళ్ళిపోతే
నీ ప్రేమ తలుసుకోని చస్తూ బతుకుతున్ననమ్మా
మందు తాగుకుంటా నిన్నే మరిశి పొదమంటే
ఆ మందు తాగినంకే మస్తు గుర్తుకొస్తవమ్మా
సీతారాములలాగే కలిసుందామనుకుంటే
రాధాకృష్ణులలాగే విడిపోయామానే
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వు నేను
విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను
దూరంగా వెళిపోయావమ్మా
దసరా పండుగా, ఊరంతా ఉండగా
మహారాణి నువ్వలా నాకై ఎంతో ప్రేమలా
జమ్మి ఆకు నా చేతుల వెట్టి కౌగిలించుకోని
జన్మ జన్మలు కలిసుందామని ప్రేమ పంచుకోని
జాతరంత నిను జూసుకుంట
నీ ఎనుక తిరిగెటోన్ని
రాతిరంత నిను తలుసుకుంట
నే నిదురపోయెటోన్ని
ఆ రోజులు అన్నీ గురుతొస్తుంటే
బాధనిపిస్తుందే
నీ పక్కన వేరే వాడిని చూస్తే
ప్రాణం పోతుందే
ఓ, నాలాగే నువ్ కూడా
ఈ బాధను మోస్తున్నావానే
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వు నేను
విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను
దూరంగా వెళిపోయావమ్మా
చీరని గట్టుకొని, గౌరమ్మను ఎత్తుకొని
బజారుమీదొచ్చి నువ్ బతుకమ్మాడంగా
దూరంనుంచి నిన్నే చూసి మురిసేవాన్నమ్మా
ఈ దుఃఖంతోని ఇంకెన్నాళ్లు బతకాలే బొమ్మ
కలిసున్నా కొన్ని రోజులు వరమనుకుంటానే
నీ ప్రేమను పొందే అదృష్టం లేదనుకుంటానే
ఇంకో జన్మే మన ఇద్దరికీ ఉంటుందో లేదో
ఓ, ఇంకో జన్మే మన ఇద్దరికీ ఉంటుందో లేదో
ఆ జన్మల కూడా ఇప్పటిలాగే వదిలేస్తావేమో
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వు నేను
విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను
దూరంగా వెళిపోయావమ్మా
Song | Love Failure Songs |
Director | Raj Narendra |
Producer | J Laxmi |
Lyrics | Ganu |
Singer | Hanumanth Yadav |
Music | Madeen SK |
Artists | Ganu, Rowdy Megha |
Song Lable |