
| Movie Name | Sindhooram (2022) |
|---|---|
| Director | Shyam Tummalapalli |
| Star Cast | Siva Balaji Manoharan, Dharma, Brigida Saga |
| Music | Gowra Hari |
| Singer(s) | Sathya Prakash & Harini Ivaturi |
| Lyricist | Balaji |
| Music Label | Aditya Music India |
దేవేరి సుకుమారి
సౌగంధ సుమపారిజాతాల
సౌశీల్య నేత్రి
కాంభోజి శృతగాత్రి
సంవేద జరిపుత్రి
తారా శశాంకాల మైత్రీ
కలలా కలిసే… కలలే మురిసే
నిదురేపోతే నువ్ వస్తావని
నాతో కలిసి… నువ్ నడిచేటి రాస్తా
నీకోసం ఎదురే చూసే
ఓ మాదిరిగా సాగే నా జీవితం
ఓహో అని అనిపించావే నువ్వో అద్భుతం
ఓ మాదిరిగా సాగే నా టెన్ టు ఫైవ్ జీవితం
ఓహో అని అనిపించావే నువ్వో అద్భుతం
ఆహా అని అనిపించిందే నా ప్రతి క్షణం
మనసే మురిసే నాలో ఉన్న ఆశనీ
కలిపే వరకు నేనే నీకు నీడని
చెలిమినే కోరితే చేయి పంచు హృదయం
కలవక లేదుగా అందమైన ఉదయం
నా మాటలనే దాటే ప్రతి అక్షరం
నీ పేరుని అనమంటుంది ఏం చెయ్యడం
నవ్వావో నవ్వించావో ఎటు చెప్పడం
నీవల్లే నేర్చానేమో ప్రేమించడం
ఇన్నాళ్ళు ఏమైందో ఈ సంబరం
దేవేరి సుకుమారి
సౌగంధ సుమపారిజాతాల
సౌశీల్య నేత్రి
కాంభోజి శృతగాత్రి
సంవేద జరిపుత్రి
తారా శశాంకాల మైత్రీ
Oh Madhiriga Saage song is from the Sindhooram movie.
Oh Madhiriga Saage song was sung by Sathya Prakash & Harini Ivaturi.
Oh Madhiriga Saage song lyrics were written by Balaji.
Oh Madhiriga Saage song music was composed by Gowra Hari.