Ardha Shathabdapu Song Lyrics - Sindhooram

Ardha Shathabdapu Song Lyrics - Sindhooram
Ardha Shathabdapu Song Lyrics: Ardha Shathabdapu is a Telugu song from the film Sindhooram starring Ravi Teja, Sanghavi, Brahmaji, directed by Krishna Vamsi. "Ardha Shathabdapu" song was composed by Srinivas (Srinivas Chakravarthy) and sung by S P Balasubramanyam. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Ardha Shathabdapu Song Details

Movie NameSindhooram (1997)
DirectorKrishna Vamsi
Star CastRavi Teja, Sanghavi, Brahmaji
MusicSrinivas (Srinivas Chakravarthy)
Singer(s)S P Balasubramanyam
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Ardha Shathabdapu Song Lyrics in Telugu

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా

స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా

దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి

తెచ్చిన బహుమానం… ఈ రక్తపు సిందూరం

నీ పాపిటలొ భక్తిగ దిద్దిన

ప్రజలను చూడమ్మా… ఓ పవిత్ర భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా

స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల

స్వేచ్ఛను చూద్దామా… దాన్నే స్వరాజ్యమందామా

కులాల కోసం… గుంపులు కడుతూ

మతాల కోసం… మంటలు పెడుతూ

ఎక్కడలేని తెగువను చూపి… తగువుకి లేస్తారే

జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని… స్వార్థపు ఇరుకుతనంలో

ముడుచుకు పోతూ… మొత్తం దేశం తగలడుతోందని

నిజం తెలుసుకోరే… తెలిసి భుజం కలిపి రారే

అలాంటి జనాల తరఫున

ఎవరో ఎందుకు పోరాడాలి

పోరి ఏమిటి సాధించాలి

ఎవ్వరికోసం ఎవరు ఎవరితో

సాగించే సమరం… ఈ చిచ్చుల సిందూరం

జవాబు చెప్పే బాధ్యత మరచిన

జనాల భారతమా… ఓ అనాథ భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా

స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా

దానికి సలాము చేద్దామా

అన్యాయాన్ని సహించని శౌర్యం

దౌర్జన్యాన్ని దహించే ధైర్యం

కారడవులలో క్రూరమృగంలా

దాక్కుని ఉండాలా… వెలుగుని తప్పుకు తిరగాలా

శతృవుతో పోరాడే సైన్యం

శాంతిని కాపాడే కర్త్యవ్యం

స్వజాతి వీరులనణచే విధిలో

కవాతు చెయ్యాలా… అన్నల చేతిలొ చావాలా

తనలో ధైర్యం అడవికి ఇచ్చి

తన ధర్మం చట్టానికి ఇచ్చి

ఆ కలహం చూస్తూ

సంఘం శిలలా నిలుచుంటే

నడిచే శవాల సిగలో తురుమిన

నెత్తుటి మందారం… ఈ సంధ్యా సిందూరం

వేకువ వైపా, చీకటిలోకా… ఎటు నడిపేనమ్మా

గతి తోచని భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని

స్వతంత్రమందామా… స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మ వినాశపు అరాచకాన్ని

స్వరాజ్యమందామా… దానికి సలాము చేద్దామా

తన తలరాతను తానే

రాయగల అవకాశాన్నే వదులుకొని

తనలో భీతిని… తన అవినీతిని

తన ప్రతినిధులుగ ఎన్నుకుని

ప్రజాస్వామ్యమని తలిచే జాతిని

ప్రశ్నించడమే మానుకొని

కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని

నడిపిస్తుందట, ఆహాహా ఆవేశం

ఆ హక్కేదో తనకే ఉందని

శాసిస్తుండట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రమున

సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం

చూస్తూ ఇంకా నిదురిస్తావా

విశాల భారతమా… ఓ విషాద భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా

స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా

దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి

తెచ్చిన బహుమానం… ఈ రక్తపు సిందూరం

నీ పాపిటలొ భక్తిగ దిద్దిన

ప్రజలను చూడమ్మా… ఓ పవిత్ర భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా

స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల

స్వేచ్ఛను చూద్దామా… దాన్నే స్వరాజ్యమందామా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sindhooram Movie

  1. Oh Madhiriga Saage Song Lyrics
  2. Hai Re Hai Jampandu Roi Song Lyrics
  3. Sindhooram Title Song Lyrics
  4. Ardha Shathabdapu Song Lyrics

Ardha Shathabdapu Song FAQ

What movie is Ardha Shathabdapu song from?

Ardha Shathabdapu song is from the Sindhooram movie.

Who sang Ardha Shathabdapu song?

Ardha Shathabdapu song was sung by S P Balasubramanyam.

Who wrote Ardha Shathabdapu song lyrics?

Ardha Shathabdapu song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Ardha Shathabdapu song?

Ardha Shathabdapu song music was composed by Srinivas (Srinivas Chakravarthy).