
| Movie Name | Malliswari |
|---|---|
| Director | K.Vijaya Bhaskar |
| Star Cast | Venkatesh, Katrina Khaif |
| Music | Koti |
| Singer(s) | S P Balasubramanyam & Shreya Ghoshal |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Aditya Music |
జన్మ జన్మల వరమీ కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం భలే వేడుక
ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక
నాయకా, ఒడే వేదిక
ఓమై డార్లింగ్ మొనాలిసా
ఎక్కిందె ఏదో నిషా
మెచ్చేసానోయ్ మనోహరా
నచ్చింది నీ తొందరా ఆ ఆఆ.
జన్మ జన్మల వరమీ కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం
భలే వేడుకా..!!
మొదటి చూపుతో మురిపించి
మెల్ల మెల్లగా తెర దించి
మాయమవ్వకే నను కవ్వించీ, ఓ
మెత్త మెత్తగా ముద్దిచ్చి
మత్తు మత్తుగా నను గిచ్చి
మంట రెపకోయ్ మైమరపించీ
హఠాత్తుగా వరాల వాన… వర్షించెన ఎడారిలోన
శృతించనా సుఖాలవీణా ఓ ప్రియతమా
నన్నడగాలా నరోత్తమా… నా సొగసు నీదే సుమా
ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక
నాయకా ఒడే వేదిక
ఎంత వింతదీ గిలిగింత
అణువు అణువునా పులకింత
తనివి తీర్చవా ఎంతో కొంతా, హా ఓ
తేనె పెదవిలో తొణికింత
తీగ నడుములో ఒణికింత
తడిమి చూడనా నీ తనువంతా
అదే కదా వివాహ బంధం
అనుక్షణం అదో సుగంధం
అందించనా ప్రియా యుగాంతం, ప్రేమామృతం
ఓ మై డార్లింగ్ మొనాలిసా
అయ్యానే నీ బానిస, స స స
జన్మ జన్మల వరమీ కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం
భలే వేడుకా..!!
ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక
నాయకా, ఒడే వేదికా
Janma Janmala song is from the Malliswari movie.
Janma Janmala song was sung by S P Balasubramanyam & Shreya Ghoshal.
Janma Janmala song lyrics were written by Bhuvana Chandra.
Janma Janmala song music was composed by Koti.