| Movie Name | Aadavari Matalaku Arthale Verule |
|---|---|
| Director | Sri Raghava |
| Star Cast | Venkatesh, Trisha |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | Udit Narayan |
| Lyricist | Kula Sekhar |
| Music Label |
కెన్ యూ ఫీల్ హర్..?
ఈజ్ యువర్ హార్ట్ స్పీకింగ్ టు హర్..?
కెన్ యూ ఫీల్ ద లవ్..?, ఎస్
ఏమైంది ఈ వేళ… ఎదలో ఈ సందడేలా
మిలమిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే
చిరుచెమటలు పోయనేలా
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మొహం
మరువలేని… ఇంద్ర జాలం
వానలోన… ఇంత దాహం
చినుకులలో వానవిల్లు… నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు
వెలవెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా… నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే
నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం
ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే
ఏమైంది ఈ వేళ… ఎదలో ఈ సందడేలా
మిలమిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే
చిరుచెమటలు పోయనేల
ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే
ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే
పెను మాయ చేసేనా
తన నడుము ఒంపులోనే
నెలవంక పూచెనా
కనుల ఎదుటే… కలగా నిలిచా
కలలు నిజమై… జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే ఉరకలేసా
Emaindi Ee Vela song is from the Aadavari Matalaku Arthale Verule movie.
Emaindi Ee Vela song was sung by Udit Narayan.
Emaindi Ee Vela song lyrics were written by Kula Sekhar.
Emaindi Ee Vela song music was composed by Yuvan Shankar Raja.