
| Movie Name | Aadavari Matalaku Arthale Verule |
|---|---|
| Director | Sri Raghava |
| Star Cast | Venkatesh, Trisha |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Sirivennela Sitarama Sastry |
| Music Label | Aditya Music |
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హా హా హా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా… గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైనా చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా… గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల… ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా… ఈ తీరుగా, ఆ ఆఆ
కన్యాదానంగా ఈ సంపద చేపట్టే
ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా… పొందే వీలుందా
అందరికి అందనిదీ… సుందరి నీడ
ఇందరి చేతులు… పంచిన మమత
పచ్చగా పెంచిన పూలత
నిత్యం విరిసే… నందనమవదా
అందానికే అందమనిపించగా
దిగివచ్చెనో ఏమో దివి కానుక
అరుదైనా చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా… గుండెల్లో కొలువుండగా
తన వయ్యారంతో… ఈ చిన్నది
లాగిందో యెందరిని నిలబడనీకా
ఎన్నో ఒంపులతో… పొంగే ఈ నది
తనేమదిని ముంచిందో… ఎవరికి ఎరుకా
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా… గుండెల్లో కొలువుండగా
Allantha Doorala song is from the Aadavari Matalaku Arthale Verule movie.
Allantha Doorala song was sung by S P Balasubramanyam.
Allantha Doorala song lyrics were written by Sirivennela Sitarama Sastry.
Allantha Doorala song music was composed by Yuvan Shankar Raja.