| Movie Name | Dalapathi (1991) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Rajinikanth, Mammootty, Shobana, Bhanu Priya, Aravind Swamy |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam & Chitra |
| Lyricist | Rajasri |
| Music Label |
పల్లవి:
అరె చిలకమ్మా చిటికెయ్యంటా… నువు రాగాలే పాడాలంటా
ఇక సాగాలి మేళాలంటా… జగ జగ జగ జాం
నీ సరదాలే రేగాలంటా… జగ జగ జగ జగజాం
ఓ చిన్నోడా పందిర వెయ్ రా… ఓ రోజూపూవు మాలే తేరా
ఈ చినదాని మెడలో వెయ్ రా… జగ జగ జగ జాం
నడిరేయంతా సందడిచేయరా… జగ జగ జగ జగజాం
ఆ టక్కరిగాడే, అహ ఈ బుల్లోడే… నను కట్టివేసే మొనగాడే లేడే
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
అహ్హా, అరె చిలకమ్మా చిటికెయ్యంటా… నువు రాగాలే పాడాలంటా
ఓ చిన్నోడా పందిర వెయ్ రా… ఓ రోజూపూవు మాలే తేరా
చరణం – 1
చీకుచింత లేదు… చిందులేసే ఊరు
పాటా ఆటా ఇది ఏందంటా
అహ ఊరి లోనివారు ఒక్కటైనారు
నీకు నాకు వరసేనంటా
పండగ నేడే మన ఊరికే… ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే… అందరికింకా వెత తీరేనే
అహ ఈ పూట కానీరా ఆటా పాటా
బుల్లెమ్మా నవ్విందంటా… జగ జగ జగ జాం
మణిముత్యాలే రాలేనంటా… జగ జగ జగ జగజాం
అరె మామయ్య రేగాడంట… జగ జగ జగ జాం
నా మనసంతా దోచాడంట… జగ జగ జగ జగజాం
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువు నాదేనంటా నీతోనే ఉంటా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
హె హె హె, అరె చిలకమ్మా చిటికెయ్యంటా… నువు రాగాలే పాడాలంటా
అరె మామయ్య రేగాడంట… నా మనసంతా దోచాడంట
చరణం – 2
వేడుకైన వేళ వెన్నెలమ్మలాగ… దీపం నీవై వెలగాలంట
అహ చీకటంతా పోయే పట్టపగలాయే
ఏలా దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచికాలమే… నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలు కోరితే… కోరికలన్నీ రేపే తీరేనే
అరె ఆనందం నీ సొంతం అంతేకాదా
చిట్టెమ్మా నన్నే చూడు… జత చేరమ్మా నాతో పాడు
మురిపాల పండగపూట… మన ముచ్చట్లే సాగాలంట
బంగారు పరువం… పలికే ఈ వేళ గుసగుసలు
పడుచు కలలే వాగులై పారేనే మహదానందం
చిలిపి కధలన్నీ మురిపించెను, మరిపించెను ఆదమరిచే
మూగమనసులే వెన్నెలని కురిపించేనే
ముగామనసులే వెన్నెలని కురిపించేనే
అరె చిలకమ్మా చిటికెయ్యంటా… నువు రాగాలే పాడాలంటా
ఓ చిన్నోడా పందిర వెయ్ రా… ఓ రోజూపూవు మాలే తేరా
అహ నువు సై అంటే… నీ తోడై ఉంటా
నీ కళ్లల్లోన నే కాపురముంటా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
జాంగు చక్కు చెచెక్కు చక్కు జాంగు చక్కు చా
అరె చిలకమ్మా చిటికెయ్యంటా… నువు రాగాలే పాడాలంటా
ఓ చిన్నోడా పందిర వెయ్ రా… ఓ రోజూపూవు మాలే తేరా
Chilakamma Chitikeyanga song is from the Dalapathi movie.
Chilakamma Chitikeyanga song was sung by S P Balasubramanyam & Chitra.
Chilakamma Chitikeyanga song lyrics were written by Rajasri.
Chilakamma Chitikeyanga song music was composed by Ilayaraja.