Movie Name | NEW FOLK SONG 2024 (2024) |
---|---|
Director | CHORIOGRAPHY-ASHOK ASHU |
Star Cast | AKHILA(RAVANKA RAKSHASI) -ARUN (PINCHAN PILLODU) |
Music | Praveen Kaithoju |
Singer(s) | LAVANYA |
Lyricist | Rajeshakudari |
Music Label | KR Creations |
Song Love Failure Song
Director Shivakrishna Veluthuru
Producer Umesh Goud Kammampati
Lyrics Kalyan Sumitra
Singer Ajay Mengani
Music Indrajitt
Artists Vishwa Priya & ShivaKrishna Veluthuru
Song Lable KR Creations
Yem Papamo Love Failure Song Lyrics
పెంచుకున్న ప్రేమ పెరిగి పెద్దదాయె
నీతోడుగా నడిచె స్నేహమె ప్రేమాయె
ఇన్నాళ్ళు నా ప్రాణము నీకోసం తల్లాడెనే
నీమనసులో నాపై నీకున్న అభిప్రాయం
ఆనాడె తెలిసుంటె
ఈనాడు నాకింక ఈబాధ లేకుండునే
నాగుండెందుకు బరువవ్వునే
మనసులో ఉన్న మాటనే
చెప్పలేక నలిగిపోతిని
నన్ను నేను ఓడించుకుంటూ
నిన్నే గెలిపిస్తినే
ఒక్కగానొక్క నాసిన్ని ప్రాణం
చిత్రహింస అనుభవిస్తూనే
సిత్రంగ సితిమంట పాలవ్వ
నాతనువు సిద్దమాయెనే… సిద్దమాయెనే
ఏం పాపమో ఏం ఘోరమో
నా ఎదకు ఎంత కష్టం
నే ఎంతగ వద్దనుకున్నా
తగ్గదమ్మ నీపై ఇష్టం
ఏం పాపమో ఏం ఘోరమో
నా ఎదకు ఎంత కష్టం
నే ఎంతగ వద్దనుకున్నా
తగ్గదమ్మ నీపై ఇష్టం
కడదాక నాకంటి చూపులోన
పదిలంగ నిన్నే దాచుకుంటా
ఎనలేని నాప్రేమ నీకు పంచానమ్మా
ప్రాణంగ నిన్నే ప్రేమించానమ్మా…
కడదాక నాకంటి చూపులోన
పదిలంగ నిన్నే దాచుకుంటా
ఎనలేని నాప్రేమ నీకు పంచానమ్మా
ప్రాణంగ నిన్నే ప్రేమించానమ్మా…
దయలేని ఆ దేవుడు… ఆటలాడుతున్నడు
నీకు నాకు మద్యన… ఎంతొ ఎడబాటు చేసినడు
నీకై కన్న కలలే… సెదిరిపోయెనిప్పుడు
నాతోడు నువు లేకుంటే
ఆగుతుందె గుండెసప్పుడు
భరించలేనంత ఈ వేదన బాధ
నాకెందుకే ఇప్పుడు… నాకెందుకే ఇప్పుడూ
ఏం పాపమో ఏం ఘోరమో
నా ఎదకు ఎంత కష్టం
నే ఎంతగ వద్దనుకున్నా
తగ్గదమ్మ నీపై ఇష్టం
ఏం పాపమో ఏం ఘోరమో
నా ఎదకు ఎంత కష్టం
నే ఎంతగ వద్దనుకున్నా
తగ్గదమ్మ నీపై ఇష్టం
ఉన్నంత నా బతుకు నీకోసమే
మొత్తంగ నీకే ఇచ్చుకుంటా
ఓక్కింత నా తనువు అణువణువు నీలోన
నింపానె నా రూపు ముద్దుగుమ్మా
ఉన్నంత నా బతుకు నీకోసమే
మొత్తంగ నీకే ఇచ్చుకుంటా
ఓక్కింత నా తనువు అణువణువు నీలోన
నింపానె నా రూపు ముద్దుగుమ్మా
కన్నీటి అంచులోన… నన్నుంచి పోయినవే
పడిగాపులే గాసినా… నీ నవ్వు చూడాలనే
అడిగుంటె ఇచ్చేద్దునే… నువు కోరిందేదేమైనా
నీ కొరకె బతుకుతున్నా… నాప్రాణాలు నీకివ్వనా
నరకాన్ని చూపించి
నన్నింత వేధించి కక్ష్యగడితివెందుకే
ఏం పాపమో ఏం ఘోరమో
నా ఎదకు ఎంత కష్టం
నే ఎంతగ వద్దనుకున్నా
తగ్గదమ్మ నీపై ఇష్టం
ఏం పాపమో ఏం ఘోరమో
నా ఎదకు ఎంత కష్టం
నే ఎంతగ వద్దనుకున్నా
తగ్గదమ్మ నీపై ఇష్టం