
| Movie Name | Miles Of Love |
|---|---|
| Director | Upendra Kumar Kayyam |
| Star Cast | Abhinav Medishetty, Ramya Pasupaleti |
| Music | RR Dhruvan |
| Singer(s) | Anurag Kulkarni |
| Lyricist | RR Dhruvan |
| Music Label | Aditya Music |
వెన్నెల్లో వెలుగంతా వాలిందే… నా ముందే వచ్చి
మనసేమో ఊగిందే ఉయ్యాలై… ఈ మాయే నచ్చి
మేఘాలలో కొత్త రాగాలే చేరి
మొదలెట్టాయేమో సరికొత్త కచ్చేరి
నక్షత్రాలే దివిలో మరిచాయ దారి
కలిసాయే ఇలపైనే నీలా నను కోరి
ఇంతలోనే తలుపు తెరిచెనా… తొలితొలి ప్రేమ
వెన్నెల్లో వెలుగంతా వాలిందే… నా ముందే వచ్చి
మనసేమో ఊగిందే ఉయ్యాలై… ఈ మాయే నచ్చి
అలుపెరుగని ఆశే… అసలెరుగని భాషే
పరిచయమే చేసింది సరికొత్త శ్వాసే
తెలియని ఈ వరసే… తెలిపినది వయసే
క్షణమైనా వినకుండా… విడువదు నీ ధ్యాసే
నమ్మలేని తీరులోన… చప్పుడేదో గుండెలోన
అల్లుకుంది నన్నిలాగా… తొలితొలి ప్రేమ
వెన్నెల్లో వెలుగంతా వాలిందే… నా ముందే వచ్చి
మనసేమో ఊగిందే ఉయ్యాలై… ఈ మాయే నచ్చి
మేఘాలలో కొత్త రాగాలే చేరి
మొదలెట్టాయేమో సరికొత్త కచ్చేరి
నక్షత్రాలే దివిలో మరిచాయ దారి
కలిసాయే ఇలపైనే నీలా నను కోరి
ఇంతలోనే తలుపు తెరిచెనా… తొలితొలి ప్రేమ
Vennello Velugantha song is from the Miles Of Love movie.
Vennello Velugantha song was sung by Anurag Kulkarni.
Vennello Velugantha song lyrics were written by RR Dhruvan.
Vennello Velugantha song music was composed by RR Dhruvan.