
| Movie Name | Swati Kiranam (1992) |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Mammootty, Radhika, Master Manjunath |
| Music | KV Mahadevan |
| Singer(s) | Vani Jayaram |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే
సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే
ఆపాత మధురము సంగీతము
అంచిత సంగాతము సంచిత సంకేతము
ఆపాత మధురము సంగీతము
అంచిత సంగాతము సంచిత సంకేతము
శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము
అమృత సంపాతము సుకృత సంపాకము
శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము
అమృత సంపాతము సుకృత సంపాకము
సరిగమ స్వరధుని సారవరూధుని
సామ సునాద వినోదిని
సకల కళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకినీ
మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
ఆలోచనామృతము సాహిత్యము
సహిత హిత సత్యము శారదాస్తన్యము
ఆలోచనామృతము సాహిత్యము
సహిత హిత సత్యము శారదాస్తన్యము
సారస్వతాక్షర సారధ్యము
జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము
సారస్వతాక్షర సారధ్యము
జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము
సరస వచోబ్ధిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణీ
మాంపాహి సాలోక్యసంధాయినీ
మాంపాహి శ్రీచక్ర సిమ్హాసినీ
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే
సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే
Vaishnavi Bhargavi Vagdevi song is from the Swati Kiranam movie.
Vaishnavi Bhargavi Vagdevi song was sung by Vani Jayaram.
Vaishnavi Bhargavi Vagdevi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Vaishnavi Bhargavi Vagdevi song music was composed by KV Mahadevan.