| Movie Name | Swati Kiranam (1992) |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Mammootty, Radhika, Master Manjunath |
| Music | KV Mahadevan |
| Singer(s) | Vani Jayaram |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
తెలి మంచు కరిగింది
తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది
పిలుపునియ్యనా ప్రభు
తెలి మంచు కరిగింది
తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది
పిలుపునియ్యన ప్రభు
నీ దోవ పొడవున
కువకువల స్వాగతం
నీ కాలి అలికిడికి
మెలకువల వందనము
తెలి మంచు కరిగింది
తలుపు తీయనా ప్రభూ
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు పవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు
పలుకరించిన చాలు
పల్లవింతును ప్రభు
పవళించు భువనాలు భానుమూర్తీ
నీ ప్రాణ కీర్తన విని
పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతినీ
పాడని ప్రకృతిని ప్రథమ కృతిని
తెలి మంచు కరిగింది
తలుపు తీయనా ప్రభూ
భూపాల నీ మ్రోలె ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
భూపాల నీ మ్రోలె ఈ బేల గానాలు
నీరాజసామికవి నీరాజనాలు
పసరు పవనాలలో పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి
పదునుదేరిన చాలు తలయూర్చు
తలిరాకు బహుపరాకులు విని
దొరలని దోరనగవు దొంతరని
తరలని దారి తొలగి రాతిరినీ
తెలి మంచు కరిగింది
తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది
పిలుపునియ్యన ప్రభూ
నీ దోవ పొడవున కువకువల స్వాగతము
నీ కాలి అలికిడికి మెలకువల వందనము
తెలి మంచు కరిగింది
తలుపు తీయనా ప్రభూ
Theli Manchu Karigindi song is from the Swati Kiranam movie.
Theli Manchu Karigindi song was sung by Vani Jayaram.
Theli Manchu Karigindi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Theli Manchu Karigindi song music was composed by KV Mahadevan.