
| Movie Name | Lucky Baskhar |
|---|---|
| Director | Venky Atluri |
| Star Cast | Dulquer Salmaan, Meenakshi Chaudhary |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | Vishal Mishra, Shweta Mohan |
| Lyricist | Shree Mani |
| Music Label | Aditya Music |
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూలవ్వండి మేడం గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తు వున్నా బావున్నారు
సరదాగా సాగే సమయంలోన
మరిచిపోతే బాధ కబురు
వద్దు అంటూ ఆపేదెవరు?
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూలవ్వండి మేడం గారు
అ: పలుకే నీది… ఓ వెన్నపూసా
అలకే ఆపే మనసా
ఆ: మౌనంతోటి మాటాడే బాషా
అంటే నీకే అలుసా
అ: ఈ అలల గట్టు… ఆ పూల చెట్టు
నిను చల్లబడవే అంటున్నాయే
ఆ: ఏం జరగనట్టు
నువ్వు కరిగినట్టు
నే కరగనంటూ చెబుతున్నాలే
అ: నీతో వాదులాడి
గెలవలేనే వన్నెలాడి
ఆ: సరసాలు చాలండి ఓ శ్రీవారు
ఆఖరికి నెగ్గేది మీ మగవారు
అ: హాయే పంచె ఈ చల్లగాలి
మళ్ళీ మళ్ళీ రాదే..!
ఆ: నీతో వుంటే ఏ హాయికైనా
నాకేం లోటే లేదు
అ: అదుగో నా మాటే
అంటోంది పూటే
సంతోషమంటే మనమేననీ
ఆ: ఇదిగో ఈ ఆటే
ఆడే అలవాటే
మానేయవేంటో కావాలనీ
నువ్వే ఉంటే చాలే
మరిచిపోనా ఓనమాలే
బావుంది బావుంది… ఓ శ్రీవారు
గారాబం మెచ్చింది… శ్రీమతి గారూ
Srimathi Garu song is from the Lucky Baskhar movie.
Srimathi Garu song was sung by Vishal Mishra, Shweta Mohan.
Srimathi Garu song lyrics were written by Shree Mani.
Srimathi Garu song music was composed by GV Prakash Kumar.