
| Movie Name | Lucky Baskhar |
|---|---|
| Director | Venky Atluri |
| Star Cast | Dulquer Salmaan, Meenakshi Chaudhary |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | Krishna Tejasvi |
| Lyricist | Shree Mani |
| Music Label | Aditya Music |
నిజమా కలా… నిజమా కలా
నీ ఊహలే వాలాయిలాగా
సాగేదెలా సాగేదెలా
నీ పయనమే అగిందిలాగా…
నువ్వు పంచిన నవ్వులు
పూచిన పువ్వులు
వంచనలిచ్చినవేగా…
వెలిగించిన వెలుగులు
తొలగిన వేళే ముంచేస్తాయిగా
నిను నమ్మిన ఆశను అల్లిన నీడను
కలగా మార్చేసావా..?
మరి ఎపుడైనా నిను ప్రశ్నించావా..?
గెలిచావో ఓడవో
నువ్వే ఎదిగావో మునిగావో
నువ్వే వెతికావో చితికావో
నీ కథలో……..
ఎగిసావో ముగిసావో
నువ్వే కురిసావో వెలిసావో
నువ్వే సాగవో అలిసావో
పర్వంలో ప్రయాణంలో, ప్రయాణంలో
జారే మాటలే… పెదవినే చేరునా
చేసిన తప్పులే… ఒప్పుగా మారునా
వర్షం నీటిలో… కాగితం పడవలే
కాలం కడలిలో తీరమే చూపునా
జరిగేలా ఓ అద్భుతం… మారేలా గతం
నిన్నే నువ్వు అన్వేషించరా
కొత్తగా ఈ క్షణం…..
నువ్వెళ్లిన దారిన గమ్యము
లేదని తెలిసెనుగా నడిచాక
మొదలయ్యిన చోటికె తిరిగొస్తావో
గెలిచావో ఓడవో
నువ్వే ఎదిగావో మునిగావో
నువ్వే వెతికావో చితికావో
నీ కథలో……..
ఎగిసావో ముగిసావో
నువ్వే కురిసావో వెలిసావో
నువ్వే సాగవో అలిసావో
పర్వంలో ప్రయాణంలో, ప్రయాణంలో
Nijamaa Kalaa song is from the Lucky Baskhar movie.
Nijamaa Kalaa song was sung by Krishna Tejasvi.
Nijamaa Kalaa song lyrics were written by Shree Mani.
Nijamaa Kalaa song music was composed by GV Prakash Kumar.