
| Movie Name | Manchi Manasulu (1962) |
|---|---|
| Director | Adurthi Subba Rao |
| Star Cast | ANR, Savitri, Shavukar Janaki, SVR |
| Music | KV Mahadevan |
| Singer(s) | Ghantasala |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
అహో ఆంధ్రభోజా… శ్రీ కృష్ణ దేవరాయా
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా
ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా
శిలలపై శిల్పాలు చెక్కినారూ
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే
అందాలు తెచ్చినారు ఊ ఊ
శిలలపై శిల్పాలు చెక్కినారు ఊ ఊ
కనుచూపు కరువైన వారికైనా
కనుచూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా
శిలలపై శిల్పాలు చెక్కినారు ఊ ఊ
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు
ఒక ప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు
ఒక చెంప శృంగార మొలుకు నాట్యాలు
నవరసాలొలికించు నగరానికొచ్చాము
కనులు లేవని నీవు కలత పడవలదు
కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు ఊ ఊ
ఏకశిల రధముపై లోకేశు ఒడిలోన
ఓరచూపుల దేవి ఊరేగి రాగా
ఏకశిల రధముపై లోకేశు ఒడిలోన
ఓరచూపుల దేవి ఊరేగి రాగా
రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి
సరిగమ పదనిస స్వరములే పాడగా
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలని కోరుతున్నారని
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే
అందాలు తెచ్చినారు ఊ ఊ
శిలలపై శిల్పాలు చెక్కినారు ఊ ఊ
రాజులే పోయినా… రాజ్యాలు కూలినా
కాలాలు మారినా… గాడ్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టిపాల్జేసినా
ఆ ఆ ఆ, చెదరనీ కదలనీ శిల్పాల వలెనే
నీవు నా హృదయాన నిత్యమై సత్యమై
నిలిచివుందువు చెలీ… నిజము నా జాబిలీ
Silalapai Silpalu Chekkinaru song is from the Manchi Manasulu movie.
Silalapai Silpalu Chekkinaru song was sung by Ghantasala.
Silalapai Silpalu Chekkinaru song lyrics were written by Acharya Athreya.
Silalapai Silpalu Chekkinaru song music was composed by KV Mahadevan.