
| Movie Name | Swathi Kiranam |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Mammootty, Radhika, Master Manjunath |
| Music | KV Mahadevan |
| Singer(s) | Vani Jayaram (Female), S P Balasubramanyam (Male) |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
శివానీ భవానీ… శర్వాణి
గిరినందిని శివరంజని… భవభంజని జననీ
గిరినందిని శివరంజని… భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివాని
శివాని భవాని… శర్వాణీ
శృంగారం తరంగించు… సౌందర్యలహరివని, ఆ ఆ ఆఆ
శృంగారం తరంగించు.. సౌందర్యలహరివని
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని, ఆ ఆ ఆఆ
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని
కరుణ జిలుగు సిరినగవుల కనకధారవీవనీ
నీ దరహాసమే దాసుల… దరి చేర్చే దారియని
శతవిధాల శృతివిధాన… స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివాని
శివానీ భవానీ… శర్వాణీ
రౌద్రవీర, రసోద్రిక్త … భద్రకాళి నీవనీ
భీతావహ భక్తాళికి… అభయపాళి నీవని
రౌద్రవీర, రసోద్రిక్త … భద్రకాళి నీవనీ
భీతావహ భక్తాళికి… అభయపాళి నీవని
సమమ మగమ మదద దమగ దసని సరిససస
సనిసనిదని దపదప మప మపదాని మపగరిస
గా గా గ గ గా గా గ గ రిగరిసాని సని సరిగరిగ
భీభత్సానల కీలవు… భీషణాస్త్ర కేళివని
భీషణాస్త్ర కేళివనీ… భీషణాస్త్ర కేళివనీ
అద్భుతమౌ, అతులితమౌ… లీల జూపినావని
గిరినందిని శివరంజని… భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన… స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివాని
శివానీ భవానీ… శర్వాణీ
Shivani Bhavani song is from the Swathi Kiranam movie.
Shivani Bhavani song was sung by Vani Jayaram (Female), S P Balasubramanyam (Male).
Shivani Bhavani song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Shivani Bhavani song music was composed by KV Mahadevan.