Pranathi Pranathi Song Lyrics - Swathi Kiranam

Pranathi Pranathi Song Lyrics - Swathi Kiranam
Pranathi Pranathi Song Lyrics: Pranathi Pranathi is a Telugu song from the film Swathi Kiranam starring Mammootty, Radhika, Master Manjunath, directed by K Vishwanath. "Pranathi Pranathi" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by C Narayana Reddy.

Pranathi Pranathi Song Details

Movie NameSwathi Kiranam
DirectorK Vishwanath
Star CastMammootty, Radhika, Master Manjunath
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistC Narayana Reddy
Music LabelAditya Music

Pranathi Pranathi Song Lyrics in Telugu

సా రీ గ మ ప మ గ మ సరిరీసా

పమగమ సరిసారీ

గ మ పనిసని పమగమ సరిరీసా

ప్రణతి ప్రణతి ప్రణతీ

పమప మగమ సరిసా

ప్రణతి ప్రణతి ప్రణతీ

ప్రణవనాద జగతికీ

మమప మమప మపనీ

ప్రణుతి ప్రణుతి ప్రణుతీ

ప్రధమ కళా సృష్టికీ

ప్రణతి ప్రణతి ప్రణతీ

ప్రణవనాద జగతికీ

ఈ ఈఈ ఈ ఈ ఈ

పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం

ఓంకారమా

సుప్రభాత వేదికపై.. శుకపికాది కలరవం

కైంకారమా

పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం

ఓంకారమా

సుప్రభాత వేదికపై (పసససాస పానిపమా)

శుకపికాది కలరవం, ఐంకారమా

పైరు పాపలకు జోలలు పాడే

గాలుల సవ్వడి హ్రీంకారమా, హ్రీంకారమా

గిరుల శిరసులను జారే ఝరుల

నడల అలజడీ శ్రీంకారమా, శ్రీంకారమా

[ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే

(ఓం ఐం హ్రీం శ్రీం)]

ప్రణతి ప్రణతి ప్రణతీ

ప్రణవనాద జగతికీ

ఈ ఈ ఈఈ ఈ ఈ

పంచ భూతముల పరిష్వంగమున

ప్రకృతి పొందిన పదస్పందన, అది కవనమా

మగ మపాపపప మపాపాపపప

నిపప నిపపప నిపాపాపపమ మపమపమగా

అంతరంగమున అలలెత్తిన

సర్వాంగ సంచలన ఖేలనా

అది నటనమా… అది నటనమా, ఆ ఆ

కంటి తుదల హరివింటి పొదల

తళుకందిన సవర్ణ లేఖనా

అది చిత్రమా… అది చిత్రమా, ఆఆ ఆ

మౌన శిలల చైతన్య మూర్తులుగ

మలచిన సజీవ కల్పన

అది శిల్పమా… అది శిల్పమా

అది శిల్పమా… అది శిల్పమా

ఆ లలితకళా సృష్ఠికీ అర్పించే జ్యోతలివే

ప్రణతి ప్రణతి ప్రణతీ

ప్రణవనాద జగతికీ

ప్రణుతి ప్రణుతి ప్రణుతీ

ప్రధమ కళా సృష్టికీ

ప్రణతి ప్రణతి ప్రణతీ

ప్రణవనాద జగతికీ

ఈ ఈఈ ఈ ఈఈ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Swathi Kiranam Movie

  1. Shivani Bhavani Song Lyrics
  2. Konda Konallo Song Lyrics
  3. Pranathi Pranathi Song Lyrics

Pranathi Pranathi Song FAQ

What movie is Pranathi Pranathi song from?

Pranathi Pranathi song is from the Swathi Kiranam movie.

Who sang Pranathi Pranathi song?

Pranathi Pranathi song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Pranathi Pranathi song lyrics?

Pranathi Pranathi song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Pranathi Pranathi song?

Pranathi Pranathi song music was composed by KV Mahadevan.