
| Movie Name | Gharshana (1988) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Prabhu, Karthik, Amala, Nirosha |
| Music | Ilayaraja |
| Singer(s) | Vani Jayaram |
| Lyricist | Rajasri |
| Music Label | Aditya Music |
రోజాలో లేత వన్నెలే
రాజాకే తేనే విందులే
ఊసులాడు నా కళ్ళు
నీకు నేడు సంకెళ్ళు
పాల పొంగు చెక్కిళ్ళు
వేసే పూల పందిళ్ళు
లవ్ లవ్ ఈ కధా… ఓ హో మన్మథా
మైకం సాగనీ… దాహం తీరనీ
రోజాలో లేత వన్నెలే
రాజాకే తేనే విందులే
మొన్న చిగురేసెనే… నిన్న మొగ్గాయనే
నేడు పువ్వాయెనే… ఓడు కల్లాడెనే
సందేల వయసెందుకో… చిందులేస్తున్నవీ
అందాల సొగసే… నినూ అందుకోమన్నదీ
క్షణం క్షణం ఇలాగే
వరాలు కోరుతున్నదీ చిన్-నదీ
రోజాలో లేత వన్నెలే
రాజాకే తేనే విందులే
ముద్దు మురిపాలలో… సద్దులే చేసుకో
వేడి పరువాలలో… పండగే చేసుకో
నా చూపులో ఉన్నవీ… కొత్త కవ్వింతలూ
నా నవ్వులో ఉన్నవీ… కోటి కేరింతలూ
ఇవే ఇవే ఈ వేళా… సుఖాల పూల వేడుకా, వేడుకా
రోజాలో లేత వన్నెలే
రాజాకే తేనే విందులే
ఊసులాడు నా కళ్ళు
నీకు నేడు సంకెళ్ళూ
పాల పొంగు చెక్కిళ్ళు
వేసే పూల పందిళ్ళు
లవ్ లవ్ ఈ కధా
ఓ హో మన్మథా
మైకం సాగనీ దాహం తీరనీ
రోజాలో లేత వన్నెలే
రాజాకే తేనే విందులే
Rojalo Letha Vannele song is from the Gharshana movie.
Rojalo Letha Vannele song was sung by Vani Jayaram.
Rojalo Letha Vannele song lyrics were written by Rajasri.
Rojalo Letha Vannele song music was composed by Ilayaraja.