
| Movie Name | Aakasam |
|---|---|
| Director | Ra. Karthik |
| Star Cast | Ashok Selvan, Ritu Varma, Shivatmika |
| Music | Gopi Sundar |
| Singer(s) | Jayashree |
| Lyricist | Samrat |
| Music Label | Zee Music South |
ఊపిరే హాయిగా… పాడెనే పదాలుగా
ఊహలే తియ్యగా… మారెనే నిజాలుగా
వేయి కళ్ళ కోరికే టెన్ టు ఫైవ్ తీరుతుందిలా
మూడు ముళ్ల కానుకై చేరే నన్నిలా, హో
ఎదలో పలికాయి సరిగమలే, ఓ ఓ
పెదవులడిగాయి మధురిమలే
మదిలో విరిసాయి ఘుమఘుమలే
(మదిలో విరిసాయి ఘుమఘుమలే)
కదలనన్నాయి నిమిషములే
పగలేమో పనితో పయనం
సరిపోదు రాత్రి సమయం
కళ్ళార్పనీదే నీ రూపమే, ఓ ఓ
మితిమీరుతుంటే ఇష్టం
బతిమాలుతున్నా ఇష్టం
ఇంకాస్త ఇష్టం నీ కోపమే
ఇమ్మన్నవి తెలిసాయా
గమ్మత్తుగుంది మాయ
నీ మత్తులో పడిపోయా
ఆశగా ఆ ఆ ఆ
ఊపిరే హాయిగా… పాడెనే పదాలుగా
ఊహలే తియ్యగా… మారెనే నిజాలుగా
వేయి కళ్ళ కోరికే తీరుతుందిలా
మూడు ముళ్ల కానుకై చేరే నన్నిలా, హో
ఎదలో పలికాయి సరిగమలే, ఓ ఓ
పెదవులడిగాయి మధురిమలే
మదిలో విరిసాయి ఘుమఘుమలే
(మదిలో విరిసాయి ఘుమఘుమలే)
కదలనన్నాయి నిమిషములే
Oopire song is from the Aakasam movie.
Oopire song was sung by Jayashree.
Oopire song lyrics were written by Samrat.
Oopire song music was composed by Gopi Sundar.