O Navvu Chalu Song Lyrics - Nuvvu Naku Nachav

O Navvu Chalu Song Lyrics - Nuvvu Naku Nachav
O Navvu Chalu Song Lyrics: O Navvu Chalu is a Telugu song from the film Nuvvu Naku Nachav starring Venkatesh, Aarthi Agarwal, directed by K Vijaya Bhaskar. "O Navvu Chalu" song was composed by Koti and sung by Shankar Mahadevan. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

O Navvu Chalu Song Details

Movie NameNuvvu Naku Nachav (2001)
DirectorK Vijaya Bhaskar
Star CastVenkatesh, Aarthi Agarwal
MusicKoti
Singer(s)Shankar Mahadevan
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

O Navvu Chalu Song Lyrics in Telugu

నా చెలియ పాదాలు… హంసలకే పాఠాలు

తాను పలికితె చాలు… తేనె జలపాతాలు

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు

వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు

మదిలో గుచ్చుకుంటుంది

ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు

మనసే ఆగనంటుంది

చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి

మళ్ళీ తిరిగి రానంది

పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా

తన కురులు చూపిస్తా ఔననక చస్తారా

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు

వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు

మదిలో గుచ్చుకుంటుంది

గుండెల్లో భోగి మంటలా

ఎండల్లో లేత వెన్నెల

కొండల్లో ఏటి పరుగులా

దూకుతున్న లయలో

గుమ్మంలో సందె వెలుగులా

కొమ్మల్లో కొత్త చిగురులా

మబ్బుల్లో వెండి మెరుపులా

ఆమెకెన్ని హొయలో

అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం

శిలైపోని మనిషుంటే మనిషే అనం

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు

వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు

మదిలో గుచ్చుకుంటుంది

గాలుల్లో ఆమె పరిమళం

ఊపిరిలో నిండి ప్రతి క్షణం

ఎటు ఉన్నా నన్ను వదలదే… ఎలా తప్పుకోను

గుర్తొస్తే ఆమె పరిచయం

కవ్వించే పడుచు పసితనం

రెప్పల్లో కైపు కలవరం… ఎలా దాచుకోను

కలో కాదో నాకే నిజం తేలక

ఎలా చెప్పడం తాను నాకెవ్వరో

అదిరి పడకయ్యా… ఇది ఆమె మాయ

ఇది కవిత కాదబ్బా… మన్మధుడి దెబ్బ

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు

వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు

మదిలో గుచ్చుకుంటుంది

ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు

మనసే ఆగనంటుంది

చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి

మళ్ళీ తిరిగి రానంది

పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా

తన కురులు చూపిస్తా ఔననక చస్తారా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nuvvu Naku Nachav Movie

  1. Aakasham Digivachi Song Lyrics
  2. Unna Maata Cheppa Neevu Song Lyrics
  3. Naa Chupe Ninu Vethikinadi Song Lyrics
  4. Okkasari Cheppaleva Song Lyrics
  5. O Navvu Chalu Song Lyrics

O Navvu Chalu Song FAQ

What movie is O Navvu Chalu song from?

O Navvu Chalu song is from the Nuvvu Naku Nachav movie.

Who sang O Navvu Chalu song?

O Navvu Chalu song was sung by Shankar Mahadevan.

Who wrote O Navvu Chalu song lyrics?

O Navvu Chalu song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for O Navvu Chalu song?

O Navvu Chalu song music was composed by Koti.