
| Movie Name | Nuvvu Naku Nachav (2001) |
|---|---|
| Director | K Vijaya Bhaskar |
| Star Cast | Venkatesh, Aarthi Agarwal, Prakash Raj |
| Music | Koti |
| Singer(s) | S.P.Balasubramanyam |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
ఆకాశం దిగి వచ్చి
మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఆకాశం దిగి వచ్చి
మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా
జరగాలి పెళ్ళంటే మరీ
చెరి సగమవమని మనసులు కలుపుతు
తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో… వెయ్యాలి మన పందిరి
చెంపలో విరబూసే… అమ్మాయి సిగ్గు దొంతరలు
ఆ సొంపులకు ఎర వేసే… అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై… జతపడు సమయంలో, ఓ ఓఓ
వానవిల్లే వధువుగ మారి… ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే, తాకగా
ధీంతక ధీంతక ధీంతక తక ధీం
ధీంతక ధీంతక ధీంతక తక ధీం
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో
వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా
జరగాలి పెళ్ళంటే మరి
విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు, ఓ ఓ
పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి
ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా
ఆకాశం దిగి వచ్చి
మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా
జరగాలి పెళ్ళంటే మరీ
చెరి సగమవమని మనసులు కలుపుతు… తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు… మురిసిన బంధుజనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే
Aakasham Digivachi song is from the Nuvvu Naku Nachav movie.
Aakasham Digivachi song was sung by S.P.Balasubramanyam.
Aakasham Digivachi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Aakasham Digivachi song music was composed by Koti.