
| Movie Name | Nuvvostanante Nenoddantana |
|---|---|
| Director | Prabhudeva |
| Star Cast | Siddharth, Trisha |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Karthik & Sumangali |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే
తియ్యదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లైలే లైలే లైలేలే
హేయ్, నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా, ఆ ఆఆ
హా, ప్రతి అడుగు తనకు తానే
సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే… వస్తోంది ఈ మార్పు
నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు
నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో
ఆ నింద నాకెందుకు
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లైలే లైలే లైలేలే
నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
హా, ఇది వరకు ఎదలయకు
ఏ మాత్రము లేదు హోరెత్తు
ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నను అడుగు
చెబుతాను పాఠాలు లేలేత పాదాలు
జలపాత మయ్యేట్టుగా
నా దారినే మళ్ళించగా
నీకెందుకో అంత పంతం
మన చేతిలో ఉంటే కదా
ప్రేమించడం మానటం
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లైలే లైలే లైలేలే
నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నా మేనుకు ఆ తియ్యదనం
నీ పెదవే అందించేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
లర లైల లైలల్లే… లర లైల లైలల్లే
లర లైల లైలల్లే… లైలే లైలే లైలేలే
Niluvadhamu Ninu Epudaina song is from the Nuvvostanante Nenoddantana movie.
Niluvadhamu Ninu Epudaina song was sung by Karthik & Sumangali.
Niluvadhamu Ninu Epudaina song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Niluvadhamu Ninu Epudaina song music was composed by Devi Sri Prasad.