
| Movie Name | Balu Abcdefg (2005) |
|---|---|
| Director | A Karunakaran |
| Star Cast | Pawan Kalyan, Shreya, Neha Oberai |
| Music | Mani Sharma |
| Singer(s) | Hariharan, Shreya Ghoshal |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
నీలో జరిగే తంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా
అంటే అన్నానంటూ కోపాలేనా
నువ్వే చెప్పు నే తప్పన్నానా
పోన్లే నీకేంటంటా నాకేమైనా
ఏదో సాయం నిన్నిమ్మన్నానా
వలపంటే నిప్పులాంటిది
కలకాలం దాచలేనిది
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
హా, సర్లే ఈ ప్రేమ సంగతి
నాలాగే నీకు కొత్తది
అయినా ముందు నీకే తెలిసేనా
ప్రతిరోజు నడిరాతిర్లో… చేస్తావా స్నానాలు
ఒళ్ళంతా చెమటలు పడితే… తప్పవుగా చన్నీళ్ళు
వణికించే చలికాలంలో… ఏమా ఆవిర్లు
ఉడికించే ఆలోచనలూ… పుడుతున్నవి కాబోలు
ఇంతిదిగా వేడెక్కే… ఊహలు రేపిందెవరు
నీలా నను వేధించే… దుష్టులు ఎవరుంటారు
అదిగో ఆ ఉలుకే చెబుతుంది నువు దాచాలనుకున్నా
దీన్నే లవులో పడిపోడం అంటున్నా
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా
ఒంట్లో బాగుంటం లేదా
ఈ మధ్యన నీకసలు
నాకేం ఎంచక్కా ఉన్నా
నీకెందుకు ఈ దిగులు
యో, దిస్ ఈజ్ వాట్ ఈజ్ లవ్
ఇట్స్ రియల్లీ టఫ్ ఫీలింగ్
యూ హావ్ గాటెన్ అప్ సో ఇట్స్
పంపింగ్ టు ద ఫీలింగ్
ఆల్ యూ గాట డు ఈజ్
టాక్ వెల్ల వాక్ వెల్ల మూవ్ వెల్ల
అండ్ గ్రూవ్ వెల్ల
అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు
వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు
ఐతేమరి నువ్వెపుడు… కనలేదా ఏ కలలు
నా కలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు
అదిగో ఆ మాటే నీనోటే చెప్పించాలనుకున్నా
దీన్నే లవులో పడిపోటం అంటున్నా
ఊ హు హు హూ, అవునా ఏమో నే కాదనలేకున్నా
నీలో జరిగే తంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
నాలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో
అంటే అన్నానంటూ కోపాలేనా
నువ్వే చెప్పు నే తప్పన్నానా
పోన్లే నీకేంటంటా నాకేమైనా
ఏదో సాయం నిన్నిమ్మన్నానా
వలపంటే నిప్పులాంటిది
కలకాలం దాచలేనిది
సలహా విని ఓప్పుకోవే ఇకనైనా
హా, సర్లే ఈ ప్రేమ సంగతి
నాలాగే నీకు కొత్తది
అయినా ముందు నీకే తెలిసేనా
Neelo Jarige song is from the Balu Abcdefg movie.
Neelo Jarige song was sung by Hariharan, Shreya Ghoshal.
Neelo Jarige song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Neelo Jarige song music was composed by Mani Sharma.