
| Movie Name | First Day First Show |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Radhan |
| Singer(s) | Ram Miriyala |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Aditya Music |
కొత్తగా ఊపిరందుకుంది ఊపిరి
సూటిగా సాగిపొమ్మని
ఆశగా తెల్లవారుతోంది రాతిరి
నిండుగా రేపు నాదని
నీ నవ్వే నీ చిరునవ్వే
నే కోరే వెన్నెల (వెన్నెలా)
ఏదైనా సాధిస్తాలే
తోడుంటే నువ్విలా
సాహసం చేయనా నీ కోసం
దించనా అందని ఆకాశం
కొత్తగా ఊపిరందుకుంది ఊపిరి
సూటిగా సాగిపొమ్మని
ఆశగా తెల్లవారుతోంది రాతిరి
నిండుగా రేపు నాదని
అటో నువ్వు ఇటో నేను
చూస్తున్నాము ఒకే కలా
ఎటువైపు లాగేస్తుంది
జీవితం ఇదేంటిలా
నీపై ఉన్న ప్రేమిది
అయినా ఆగనన్నదీ
ఏదో నమ్మకం ఇలా పదా అన్నది
ఇంకాసేపు ఇదే తూర్పు
రంగు మారదా టెన్ టు ఫైవ్
నలుగుతున్న నన్ను చూసి
వెలుగునివ్వదా ఆ ఆఆ
నీ నవ్వే నీ చిరునవ్వే
నే కోరే వెన్నెల (వెన్నెలా)
ఏదైనా సాదిస్తాలే
తోడుంటే నువ్విలా
సాహసం చేయనా నీ కోసం
దించనా అందని ఆకాశం
దూరమా అంత దూరమేమి కాదులే
చేరనా చేరి చూపనా
భారమా అస్సలైతే కానే కాదులే
హాయిగా దాన్ని మోయనా
Nee Navve Nee Chirunavve song is from the First Day First Show movie.
Nee Navve Nee Chirunavve song was sung by Ram Miriyala.
Nee Navve Nee Chirunavve song lyrics were written by Ramajogayya Sastry.
Nee Navve Nee Chirunavve song music was composed by Radhan.