
| Movie Name | IIT Krishnamurthy (2020) |
|---|---|
| Director | Sree Vardhan |
| Star Cast | Prudhvi Dandamudi, Maira Doshi |
| Music | Naresh Kumaran |
| Singer(s) | Yazin Nizar |
| Lyricist | Ramanjhaneyulu Sankarpu |
| Music Label | Mango Music |
మేఘంతో మేఘం మురిసే… వానల్లే మారే వరసే
తీరంతో కడలేమో కలిసే… ఆనందం అలలా ఎగిసే
ఏ చోట వేరే కాలేని తీరే… ఓ జతగా నడిచే జగమే విడిచే
చుట్టూరా ఎవరూ ఉన్నారో కనరు
ఉంటారే ఎపుడూ ఎవరూ లేనట్టు
అరె అరెరే అరెరే అరెరే… ఎదురెదురే నిలిచే కనులే
అరె అరెరే అరెరే అరెరే… ఎటువైపో ఎగిరే యదలే
పాదం ఆగింది ఏమైందని… గమ్యం చేరిందో ఏమో మరి
చూస్తూ చూస్తూనే ఓ మాయల… చూపే సాగింది ఓ నీడలా
కనులే వెళుతుంటే దూరంగానే… కలలే ఆగాయి ఓ చోటనే
ఏమో ఏమైందో అంటే మరి… బదులంటూ లేదే ఈ ప్రశ్నకి
అరె అరెరే అరెరే అరెరే… పరిచయమే ఇపుడే మొదలా
అరె అరెరే అరెరే అరెరే… కడవరకు కదిలే కధలా
అంతేలేనంత సంతోషమే… అంతా అయిపోయే నీ సొంతమే
జాడే లేదంట ఏకాంతమే… తోడై చేరాక ఈ బంధమే
ఎదలే వేరంటే పై పై మాటే… కలిసే ఈ జంట శ్వాసించనే
దూరం రానంది నీ వైపుకే… కాలం ఆగింది నీ రాకకే
అరె అరెరే అరెరే అరెరే… ఎదురుపడే వెతికే నిధులే
అరె అరెరే అరెరే అరెరే… కడలి ఒడే ఒదిగే నదులే
Megham Tho Megham song is from the IIT Krishnamurthy movie.
Megham Tho Megham song was sung by Yazin Nizar.
Megham Tho Megham song lyrics were written by Ramanjhaneyulu Sankarpu.
Megham Tho Megham song music was composed by Naresh Kumaran.