
| Movie Name | Jagadeka Veerudu Athiloka Sundari |
|---|---|
| Director | K. Raghavendra Rao |
| Star Cast | Chiranjeevi, Sridevi |
| Music | Ilayaraaja |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
విజయుడై వచ్చినాడురా… తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా… ఆ స్వర్గమునే దించినాడురా
అక్షితలే చల్లినారు రమణులంతా
అహా హారతులే భక్తిమీర పట్టినారురా
సింహాసనమెక్కి తాను విష్ణుమూర్తిలా
అహ శిరులెన్నో చెలువు మీద చిలికినాడురా
ఏ రాజు ఎవరైనా… మా రాజువింక నువ్వంటా
నీ మనసే మా కోట… మీ మాట మాకు పూబాట
రాజాధి రాజా మార్తాండ తేజ
నాపేరే రాజు… మై నేమ్ ఈజ్ రాజు
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాధే ఈ రాజు పాట
నాపేరే రాజు… ఎన్ పేర్ దా రాజు
మేరా నాం రాజు… మై నేమ్ ఈజ్ రాజు, రాజు రాజు
అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు. పెద్ద రాణి నాట్యంలో మయూరి
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట.
పద పద సాస సరి గరి సాపద
పద పద సాస సగరిగ సరి గస పద
దరి రిగ గస సప గరిస దప గారిస
కళలే పోషించినాడురా… తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా… ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి
అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి
అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా
నీలాంటి రాజుంటే… ఆ దేవుడింక ఎందుకంట
చల్లనైన నీ చూపే… మాకున్న పండు ఎన్నెలంట
రాజాధి రాజా మార్తాండ తేజా
నా పేరే రాజు… మేరా నాం రాజు
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాదే ఈ రాజు పాట
మమ నామ రాజు… ఎన్ పేర్ దా రాజు
ఎండ వేరే రాజు… నన్న హెసరే రాజు
నా పేరే రాజు
Mana Bharatamlo song is from the Jagadeka Veerudu Athiloka Sundari movie.
Mana Bharatamlo song was sung by S P Balasubramanyam.
Mana Bharatamlo song lyrics were written by Veturi Sundararama Murthy.
Mana Bharatamlo song music was composed by Ilayaraaja.