
| Movie Name | Jagadeka Veerudu Athiloka Sundari |
|---|---|
| Director | K. Raghavendra Rao |
| Star Cast | Chiranjeevi, Sridevi |
| Music | Ilaiyaraaja |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
వయ్యారాల వెల్లువ
వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోన పుంగవా
పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
చిటపట నడుముల ఊపులో
ఒక ఇరుసున వరసలు కలవగా
ముసిరిన కసి కసి వయసులో
ఒక ఎద నస పదనిస కలవుగా
కాదంటూనే కలబడు
అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు
తెగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా
వయసు నిలబడు కౌగిట
అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
పురుషుల్లోన పుంగవా
పులకింతొస్తే ఆగవా
వయ్యారాల వెల్లువ
వాటేస్తుంటే వారెవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ…ఊహు..!
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ…ఆహహ్హా
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
ఆ ఆ ఆఅ ఆ ఆఁ…
అడగక అడిగినదేమిటో
లిపి చిలిపిగా ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో
పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవులు
అవి నేడైనాయి మధువులు
రెండున్నాయి తనువులు
అవి రేపవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా
మనకు ముదిరెను ముచ్చట
అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
పురుషుల్లోన పుంగవా
పులకింతొస్తే ఆగవా
వయ్యారాల వెల్లువ
వాటేస్తుంటే వారెవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
Abbani Teeyani Debba song is from the Jagadeka Veerudu Athiloka Sundari movie.
Abbani Teeyani Debba song was sung by S P Balasubramanyam, Chitra.
Abbani Teeyani Debba song lyrics were written by Veturi Sundararama Murthy.
Abbani Teeyani Debba song music was composed by Ilaiyaraaja.