
| Movie Name | Folk |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Kalyan Keys |
| Singer(s) | Mounika Yadav Mamindla |
| Lyricist | Jogula Venkatesh |
| Music Label |
మా గల్లీల ఒక్కడు పోరడు
అందగాడడు నన్ను జూత్తడు
నన్ను జూసిన జూడనట్టుంటడు
నవ్వుతుంటడు కన్నుగొడతడు, సైగ జేత్తడు
వాడు మురిపాల… ముద్దుల కృష్ణుడు
తెలివిగల్లోడు తెల్లగుంటడు
నన్ను సాటుకిలిసి ముచ్చటంటడు
ముద్దులంటడు సరసమంటడు, లొల్లి జేత్తడు
ఇగ పొద్దున్నే మా వాడకత్తడు
కావలుంటడు అడ్డమొత్తడు
నన్ను కాలేజికే బోనీయడు
బండిదెత్తడు ఎక్కమంటడు పోదామంటడు
నాకు ఊరు వాడ జూపిత్తడు
జాతరంటడు తొల్కవోతడు
నేనడిగింది నాకు గొనిత్తడు
రాణివంటడు, రాజునంటడు, మురిసిపోతడు
వాడు సక్కని మనసున్న పోరడు
ఊరినిడవడు ఊళ్ళే ఉంటడు
ఈ ఊరంతా నా వోళ్లే అంటాడు
తోడుగుంటడు సాయమైతడు, సాగిపోతడు
వాడు ఆస్తి పాస్తి దండిగున్నోడు
కాని లేనోడు అన్నట్టుంటడు
అందరితోని గలిసి మెలిసుంటడు
బుద్ధిమంతుడు, సదువుకున్నోడు సక్కనైనోడు
వాడు సుక్కల్లో మెరిసేటి సెంద్రుడు
కలవ కళ్ళోడు… కాంతి నవ్వోడు
పారాయి అమ్మాయిలని జూడడు
దారి ఇస్తడు పక్కకెలతడు, పారిపోతడు
మరి నేనంటే… పడి సచ్చిపోతడు
నన్ను ఇడవడు, కలవరిత్తడు
వాడు పడుకున్నా… నా పేరే తల్తడు
మొండి గుణమోడు, మాయజేశాడు
మనసు దోశాడు
నా మేనత్త ముద్దుల కొడుకాడూ
వరస అయినోడు… మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు ఏలుకుంటాడు, తోడుగుంటాడు
నా మేనత్త ముద్దుల కొడుకాడు
వరస అయినోడు మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు ఏలుకుంటాడు, తోడుగుంటాడు
Ma Gallilo Okkadu Poradu song is from the Folk movie.
Ma Gallilo Okkadu Poradu song was sung by Mounika Yadav Mamindla.
Ma Gallilo Okkadu Poradu song lyrics were written by Jogula Venkatesh.
Ma Gallilo Okkadu Poradu song music was composed by Kalyan Keys.