
| Movie Name | Hosanna Ministries |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Pastor John Wesley |
| Lyricist | John Wesley |
| Music Label |
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం నేను ప్రకటించెదా
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం నేను ప్రకటించెదా
నాపైన ప్రేమ చూపించి
నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వీకుడా
నీకోసమే నా జీవితం
నీకోసమే నా జీవితం
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం నేను ప్రకటించెదా
ఏనాడు నను వీడని
నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే
సందడిని చేసెను ||2||
అణువణువును బలపరిచే
నీ జీవపు వాక్యమే
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం నేను ప్రకటించెదా
ప్రతిక్షణము దరిచేరి
నన్నే తాకెను ||2||
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి
నన్నే నడిపించెను
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం నేను ప్రకటించెదా
ఈ వింత లోకంలో
నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమలోనే
ఆదరణ పొందితిని ||2||
నీ కృపలో నిలిపినది
నీ ప్రేమబందమే
అనుదినము మకరందమే
నీ స్నేహబంధము ||2||
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం నేను ప్రకటించెదా
ఆ ప్రేమలోనే కడవరకు
నన్ను నడిపించుమా, స్థిరపరచుమా
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం నేను ప్రకటించెదా
నే వేచియున్నాను
నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్న ఈ నిరీక్షణనే
సన్నిధిలో నిలిపినది ||2||
నా కోసం నిర్మించే
సౌందర్య నగరములో
ప్రణమిల్లి చేసెదను
నీ పాదాభివందనం ||2||
తేజోమయా నీ శోభితం
నే పొందెద కొనియాడెద
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం నేను ప్రకటించెదా
Karuna Sampannuda song is from the Hosanna Ministries movie.
Karuna Sampannuda song was sung by Pastor John Wesley.
Karuna Sampannuda song lyrics were written by John Wesley.